డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియో తీశారు, యువతి షాకింగ్ స్పందన
లాహోర్: ప్రపంచవ్యాప్తంగా మహిళల పైన వేధింపుల పర్వం ఉంది. రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే టీజ్ చేస్తారు. రహస్యంగా వారి వీడియోలు తీసి నెట్లో పెడతామని బెదిరిస్తారు. కొందరు మహిళలను లొంగదీసుకొని, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.
ఇలా ఎన్నో విధాలుగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. అలాగే, పాకిస్తాన్‌లో ఓ యువతి వేధింపులను ఎదుర్కొంది. అయితే, ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి ఇంట్లో దుస్తులు మార్చుకుంటుండగా నలుగురు యువకులు ఆమెకు తెలియకుండా కిటికీ నుంచి వీడియో తీశారు. ఆ వీడియోలతో ఆమెను బెదిరించారు. బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. వీడియోలను నెట్లో పెడతామని బెదిరించారు.
ఆమె గదిలోకి ఓ లెటర్ విసిరి పారిపోయారు. ఆ లెటర్లో రాసినవి చెప్పలేని విధంగా ఉన్నాయి. ఆమె ఏ రంగు లోదుస్తులు మార్చుకుందో, ఎలా ధరించిందో అంతా రాశారు. నీ న్యూడ్ వీడియో మా వద్ద ఉందని అందులో పేర్కొన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె వారిని ప్రశ్నించింది. ఇలాంటి పనులు చేస్తున్న మీరు కూడా 'కొడుకులు, సోదరులు, తండ్రులు కాదా' అని ప్రశ్నించింది. తద్వారా మీకు తల్లి, సోదరి, కూతురు ఉంటుందని ఘాటుగా ప్రశ్నించింది. ఆమె ఫేస్‌బుక్ పోస్టుకు మద్దతు లభిస్తోంది.












Click it and Unblock the Notifications