బ్రా ధరించిన గొర్రె ఫోటో వైరల్..అసలు కారణం ఏంటో తెలుసా? నెటిజెన్ల ప్రశంసలు

పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే వాటికి రకరకాల దుస్తులు ధరింపజేసి సరదాపడుతాము. ఎక్కువగా పెంచుకునే కుక్కలు, పిల్లులకు ఫ్యాన్సీ డ్రెస్‌లు వేస్తాము. షర్టు ప్యాంటు లాంటివి వాటికి వేసి ముచ్చటపడతాము. కానీ బ్రిటన్‌లో మాత్రం ఓ పెంపుడు గొర్రెకు బ్రా వేసి దాని యజమాని ముచ్చట తీర్చుకున్నాడు. దీని వెనక ఒక కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఈ బ్రా ధరించిన గొర్రె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విదేశాల్లో జరిగే హాలోయీన్ వేడుకల్లో రకరకాల వస్త్రధారణతో వేషధారణతో అక్కడి ప్రజలు ఆకట్టుకుంటారు. ఇక్కడ మనుషులు కాకుండా జంతువులకు కూడా ఫ్యాన్సీ డ్రెస్ తొడుగుతారు.

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న గొర్రె పేరు రోజ్. ఈ గొర్రె గర్భం దాల్చింది. దాని కడుపులో మూడు పిల్లలు ఉన్నట్లు వెటరనరీ డాక్టర్లు గుర్తించారు. ఇక మూడు పిల్లలు దాని కడుపులో ఉండటంతో పొట్ట మొత్తం భూమిని తాకుతోంది. దీంతో దాని పొట్ట రాపిడికి గురై గాయమవుతోంది. ఇది కడుపులో ఉన్న పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు తల్లి గొర్రెకు కూడా ప్రాణహాని ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో యజమాని ఆ గొర్రెకు బ్రా తొడిగారు. దీనివల్ల గొర్రె కడుపు బ్రాలో సెట్ అయ్యింది. ప్రమాదం తప్పింది.

A photo of the Sheep with Bra on goes viral, netizens praise the owner, here is why

ఇక బ్రా తొడిగి ఉన్న గొర్రె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్ అయ్యాయి. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు. గొర్రె చాలా లక్కీ అని మూగజంతువు ఆరోగ్యం పట్ల ఇంతటి జాగ్రత్త తీసుకున్న యజమానిని ప్రశంసించారు. ఇలా మూగజీవాలపై శ్రద్ధ తీసుకునే వారు చాలా తక్కువమంది ఉంటారని మరికొందరు పోస్టులు పెట్టారు. ఇలాంటి ఐడియా ఇప్పటి వరకు ఎవరికీ తట్టలేదని మంచి ఐడియాతో ముందుకు వచ్చిన యజమానిని కొనియాడారు మరికొంతమంది నెటిజెన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+