Corona: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 30 వేలు దాటిన రోజువారీ కేసులు..

మన పక్క దేశం చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. చైనాలో రోజువారీ కోవిడ్ కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అధికారిక డేటా ప్రకారం చైనాలో 31,454 దేశీయ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27,517 లక్షణాలే లేవని బుధవారం, నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. చైనా జనాభా 1.4 బిలియన్ల జనాభాతో పోల్చినప్పుడు ఈ సంఖ్యలు చాలా తక్కువగానే ఉంది. కేసులు పెరగకుండా చైనా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్‌ డౌన్ విధించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకిన నగరాల్లో కఠినమైన నిర్బంధం విధిస్తున్నారు. కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మెగాసిటీ షాంఘై లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు ఏప్రిల్ లో29,390 నమోదయ్యాయి. తాజాగా బుధవారం నమోదైన కేసులు ఆ గణాంకాలు మించిపోయాయి.

In China, the country of the dragon, daily corona cases have increased drastically

ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్లాంట్‌లో ఉద్యోగులు నిరసనకు దిగారు.యాపిల్ తయారీ ఫ్యాక్టరీలో కూడా పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండాలని నిబంధన విధించడంతో వారు ఆందోళన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+