వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటకు 9 వేల కి.మీ వేగం: చంద్రుడిని ఢీ కొట్టనున్నపవర్‌ఫుల్ రాకెట్: సమయం లేదు మిత్రమా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ ప్రయోగించిన ఓ రాకెట్.. త్వరలో చందమామను ఢీ కొట్టబోతోంది. 2015లో ఫ్లోరిడాలోని డీప్ స్పేస్ క్లైమెట్ అబ్జర్వేటరీ నుంచి అంతరిక్షంలోకి పంపించిన ఫాల్మక్ 9 బూస్టర్ రాకెట్ ఇది. వాతావరణంపై పరిశోధనలు, తాజా సమచారాన్ని సేకరించడానికి అంతరిక్షంలోకి ఈ రాకెట్‌ను పంపించింది స్పేస్ఎక్స్. గంటకు తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అది భూమి-చంద్రుడి చుట్టూ అత్యంత ప్రమాదకరంగా పరిభ్రమిస్తోంది.

వంగలపూడి అనిత..నారీ సంకల్ప దీక్ష: వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలువంగలపూడి అనిత..నారీ సంకల్ప దీక్ష: వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు

 చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్..

చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్..

ఈ ఫాల్కన్ రాకెట్ ఇతర ఉపగ్రహాలను ఢీ కొట్టకుండా ఉండటానికి- దీన్ని ఉద్దేశపూరకంగా చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. నాలుగు టన్నుల మేర బరువు ఉన్న బూస్టర్లు దీనికి అమర్చి ఉండటం వల్ల ఇతర శాటిలైట్లకు ఇది హాని కలిగిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ రాకెట్.. మార్చి 4వ తేదీన చంద్రుడిని ఢీ కొట్టేలా దాని పరిభ్రమణాన్ని, దిశను మార్చనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని బిల్ గ్రే తెలిపారు.

 భూమి-చంద్రుడి మధ్య చక్కర్లు..

భూమి-చంద్రుడి మధ్య చక్కర్లు..

తన గమ్యస్థానానికి చేరుకున్న తరువాత ఆ రాకెట్‌ను తిరిగి భూకక్ష్యలోనికి తీసుకుని రావడానికి స్పేస్‌ఎక్స్ సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందులో ఫ్యూయెల్ లేకపోవడమే దీనికి కారణమని నిర్ధారించారు. భూమి-చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి ఈ రాకెట్ తప్పించుకోలేకపోతోందని, భూకక్ష్యలోనికి ప్రవేశపెట్టడానికి చాలినంత ఇంధనం లేదని అంతరిక్ష పరిశోధకుడు ఎరిక్ బెర్జర్ చెప్పారు. ఫలితంగా ఈ రాకెట్ భూమి-చంద్రుడి మధ్య చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు.

 నాలుగు టన్నుల బరువు..

నాలుగు టన్నుల బరువు..

ప్రస్తుతం గంటకు ఈ రాకెట్ వేగం 9,000 కిలోమీటర్లుగా ఉందని, దీన్ని మార్చి 4వ తేదీన చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయ్యేలా చేస్తున్నామని అన్నారు. అదే వేగంతో చంద్రుడిని ఢీ కొట్టేలా చేస్తామని పేర్కొన్నారు. ఫలితంగా చంద్రుడిని ఢీ కొట్టిన చోట పెద్ద పెద్ద క్రేటర్స్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల సరికొత్త అధ్యయనాలు చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని అంతరిక్ష పరిశోధకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు టన్నుల బరువు ఉన్న రాకెట్ 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టినప్పుడు వెలువడే ధూళిని అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ రాకెట్‌ను స్పేస్ జంక్‌గా గుర్తించామని అన్నారు.

ఇదివరకూ క్రాష్ ల్యాండింగ్స్..

ఇదివరకూ క్రాష్ ల్యాండింగ్స్..

చంద్రుడి మీద క్రాష్ ల్యాండింగ్ చేయించడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు 1959లో సోవియట్ లూనా 2.. చంద్రుడి మీద క్రాష్ ల్యాండింగ్ అయ్యేలా చేశారు పరిశోధకులు. అప్పటి సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి ఆర్టిఫీషియల్ ఎర్త్ శాటిలైట్ స్పుత్నిక్ 1ను మోసుకెళ్లిన రాకెట్ ఇది. 2009లో జపాన్ తన రిలే శాటిలైట్ ఒకినావాను చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయ్యేలా చేసింది. 2012లో నాసా ఎబ్ అండ్ ఫ్లో స్పేస్‌క్రాఫ్ట్ కూడా చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఢీ కొట్టింది.

 దురదృష్టవశావత్తూ..

దురదృష్టవశావత్తూ..

అపోలో ల్యాండింగ్ సైట్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండటానికి దీన్ని క్రాష్ ల్యాండింగ్ చేసింది. గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిని ఢీ కొట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ కూడా చంద్రుడి మీద క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. అది ఉద్దేశపూరకంగా చేసిన క్రాష్ ల్యాండింగ్ కాదు. చంద్రుడి మీద సజావుగా అడుగు పెట్టేలా చేయడం ఇస్రో విఫలం కావడం వల్ల దురదృష్టవశావత్తూ అది క్రాష్ ల్యాండిగ్ అయింది.

English summary
The fast-moving piece of space junk is the upper stage of a SpaceX Falcon 9 rocket which hoisted the Deep Space Climate Observatory satellite off our planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X