గూగుల్ కంటే మెరుగైన సెర్చ్ ఇంజన్
కెనడాలో నివసిస్తోన్న భారతి సంతతి విద్యార్ధి గూగుల్ కంటే మెరుగైన సెర్చ్ ఇంజన్‌ను కనుగొన్నాడు. 16 ఏళ్ల అన్మోల్ టుక్రేల్ అనే విద్యార్ధి తన ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గూగుల్ కంటే మెరుగైన, 47 శాతం ఖచ్చితమైన సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాడు.

అయితే అతడి ఆవిష్కరణకు సంబంధించిన ఆధారాలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. తన సెర్చ్ ఇంజన్ నమూనాని గూగుల్ సైన్స్ ఫెయిర్‌లో కూడా ప్రదర్శించాడు. ఇంకా హైస్కూల్ కూడా పూర్తి చేయని అన్మోల్ రూపొందించిన ఈ సెర్చ్ ఇంజన్ వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఉపయోగపడడటమే కాకుండా సామీప్యతను కూడా పెంచుతుంది.
న్యూయార్క్ టైమ్ ప్రతి ఏటా ప్రచురించే 'ఈ ఏటి ఆవిష్కరణ' ఆర్టికల్ కోసం అన్మోల్ ప్రాజెక్టును స్టడీ చేస్తున్నారు. కేవలం ఒక కంప్యూటర్ సహాయంతో పైథాన్ లాంగ్వేజీని అభివృద్ధి చేయడం ద్వారా అన్మోల్ ఈ కొత్త సెర్చ్ ఇంజన్‌ను రూపొందించాడు.












Click it and Unblock the Notifications