షాక్: డేటింగ్ వెబ్ సైట్ లో ఛాటింగ్, ప్రియుడిని చూసి పెళ్ళి రద్దు చేసింది

ప్రపంచంలో ఏ యువతికి ఎదురవ్వని పరిస్థితి ఓ యువతికి కలిగింది. దీంతో ఆ యువతి షాక్ కు గురైంది.28 ఏళ్ళ యువతి తాను ఆన్ లైన్ లో చాటింగ్ చేసిన యువకుడిని చూసి ఆశ్చర్యయానికి గురైంది.

బోస్టన్: ప్రపంచంలో ఏ యువతికి ఎదురవ్వని పరిస్థితి ఓ యువతికి కలిగింది. దీంతో ఆ యువతి షాక్ కు గురైంది.28 ఏళ్ళ యువతి తాను ఆన్ లైన్ లో చాటింగ్ చేసిన యువకుడిని చూసి ఆశ్చర్యయానికి గురైంది.దీంతో ఆమె పెళ్ళి చేసుకొనే ప్రతిపాదనను విరమించుకొంది.

ప్రియా ఇలియాస్ 28 ఏళ్ళు. ఓ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ద్వారా తనకు కాబోయే భర్తను ఎంచుకొంది. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. చాలా రోజులపాటు చాటింగ్ చేశారు. ఓ హోటల్లో డిన్నర్ చేద్దామంటూ కాబోయే భర్తను ఆమెను డిన్నర్ కు ఆహ్వానించింది.

A shocking incident for Priya iliyas

కనీసం కాఫీ కూడ తాగడానికైన రావాలని ఆమె అతడిపై ఒత్తిడి పెంచింది.ఆమె ఒత్తిడి భరించలేక అతడు ఆమెను కలిసేందుకు వచ్చాడు.అయితే ముందుగా అనుకొన్న సమయానికి ఆమె ఆ ప్రదేశానికి చేరుకొంది.

తాను ఆహ్వానించిన కాబోయే భర్త కోసం ఎదురుచూస్తోంది.అయితే ఆమె కోరుకొన్న క్షణం రానే వచ్చింది. అయితే ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన ఓ వ్యక్తి నువ్వు ప్రియావా అంటూ కొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా అతడిని చూసిన ఆ యువతి కుప్పకూలిపోయింది.

తాను చాటింగ్ చేసిన వ్యక్తి 70 ఏళ్ళకు పైబడిన వ్యక్తి. కానీ, అతడితో మాట్లాడిన తర్వాత అతడి వయస్సు 90 ఏళ్ళకు పైబడి ఉందని తేలింది.ఆన్ లైన్ డేటింగ్ సైట్ లో అసంపూర్ణంగా పూర్తి చేసిన వివరాల వల్ల పొరపాటు జరిగింది.

వివరాలు చెప్పకుండా డేటింగ్ చేయడంతో ఈ సమస్య ఏర్పడిందని ఆమె గుర్తించింది. అయితే ఆ ముసలాయనతో ఆమె కొద్దిసేపు మాట్లాడింది. ఆన్ లైన్ డేటింగ్ సైట్ లైంగిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారని అందుకే తాను వాటిని ఉపయోగిస్తున్నట్టు ఆతడు చెప్పారు.కొద్దిసేపు అతడితో మాట్లాడి ఇంటికి వచ్చిన ఆ మహిళ ఆ వ్యక్తిని బ్లాక్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+