ఫ్రెంచ్‌కిస్‌పై రీసెర్చ్: 8కోట్ల బ్యాక్టీరియాలు ట్రాన్స్‌ఫర్

న్యూఢిల్లీ: పది సెకండ్ల పాటు పెట్టే ముద్దు వల్ల ఎనిమిది కోట్ల బ్యాక్టీరియాలు ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయట. ఈ విషయాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా తేల్చారు. ఈ లిప్ కిస్ వల్ల ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశించే కొన్ని బ్యాక్టీరియాలు మంచివేనంటున్నారు.

శాస్త్రవేత్తలు ముద్దు పైన పరిశోధన జరిపారు. ఫ్రెంచ్ కిస్ వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రో బ్యాక్టీరియా పెరుగుతుందని వారి పరిశోధనలో తేలింది.

A single 10 seconds kiss can transfer as many as 80 million bacteria

ఈ శాస్త్రవేత్తలు మొత్తం 21 జంటలు ముద్దుల పైన పరిశోధన చేశారు. రోజుకు తొమ్మిదిసార్లకు పైగా ముద్దు పెట్టుకున్న వారు తమ లాలాజలాన్ని షేర్ చేసుకున్నారు. దాదాపు ఏడువందల రకాల బ్యాక్టీరియాలు నోటి వద్ద ఉంటాయి. ఇందులో కొన్ని బ్యాక్టీరియాలు సులభంగా ట్రాన్సుఫర్ అవుతాయని పరిశోధనలో తేలింది.

నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన శాస్తవేత్తలు 21 జంటలను వారు పెట్టుకున్న ముద్దు అలవాటు పైన ప్రశ్నించారు. గత ఏడాదిగా తరుచూ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటున్నారో, అలాగే చివరిసారి ఎప్పుడు ముద్దు పెట్టుకున్నారో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కచ్చితంగా పదిసెకండ్ల పాటు ముద్దు పెట్టుకోవాలని జంటలకు సూచించారు. సదరు జంటలు పది సెకండ్ల పాటు ముద్దు పెట్టుకునే ముందు, ఆ తర్వాత... వారి నాలుకల నుండి, లాలాజలం నుండి శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా శాంపిల్స్ తీసుకొని పరిశోధన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+