Turkey Blast: టర్కీ పార్లమెంట్ వద్ద ఆత్మహుతి దాడి..
టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. వేసవి సెలవుల తర్వాత పార్లమెంటు తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు పేలుడు జరగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రెండో దుండగుడు హతమయ్యారని అధికారులు తెలిపారు.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారని మంత్రి అలీ యెర్లికాయ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసారు.
ఆత్మహుతికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. కుర్దిష్, వామపక్ష తీవ్రవాద గ్రూపులతో పాటు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ గతంలో దేశవ్యాప్తంగా ఘోరమైన దాడులకు పాల్పడ్డాయి. దుండగులు ఆదివారం ఉదయం తేలికపాటి వాణిజ్య వాహనంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారని యెర్లకాయ చెప్పారు. వద్ద ఇంటీరియర్ మంత్రిత్వశాఖ భవనంలో ఉన్న సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద ఆత్మాహుతి దాడికి తెగపడ్డారు.

టర్కిష్ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ భవనాలకు సమీపంలో ఉన్న ప్రాంతంలో పార్క్ చేసిన వాహనం దగ్గర బాంబు స్క్వాడ్‌లు పనిచేస్తున్నట్లు టెలివిజన్ ఫుటేజీ కనిపించింది. దాడి తర్వాత ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సిటీ సెంటర్‌లోకి వెళ్లే దారిని పోలీసులు చుట్టుముట్టారు. ఇద్దరు పోలీసు అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా లేదని మీడియా నివేదికలు తెలిపాయి. గతంలో కూడా టర్కీలో ఆత్మహుతి దాడులు జరిగాయి.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications