బర్త్ డే పార్టీలో అపశ్రుతి: మిస్ ఫైరింగ్, బలి
డల్లాస్: పుట్టిన రోజు నాడు సంతోషంతో గంతులు వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అమెరికాలో జరిగింది. పెద్దలు వారిస్తున్నా మాట వినకపోవడంతో బర్త్ డే బాయ్ చేతిలోని రివాల్వర్ తూటాలు అతని శరీరంలోకి దూసుకు వెళ్లాయి.
అమెరికాలోని డల్లాస్ లో జోసెఫ్ (21) నివాసం ఉంటున్నాడు. ఇతను గత గురువారం 21వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సందర్బంలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా గడిపాడు. తరువాత అతని దగ్గర ఉన్న రివాల్వర్ బయటకు తీశాడు.

సరదాగా రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతని దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కొని దాచిపెట్టారు. అయితే జోసెఫ్ మొత్తం గాలించి మళ్లి రివాల్వర్ తీసుకుని బయటకు వచ్చి కాల్పులు జరిపాడు.
ఆ సందర్బంలో ప్రమాదవశాత్తు బుల్లెట్ అతని శరీరంలోని దూసుకు వెళ్లింది. వెంటనే అతనిని సమీపంలోని మెథడిస్ట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అతను మరణించాడని పోలీసులు అన్నారు. మద్యం మత్తులో జోసెఫ్ కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications