మద్యం మత్తులో యువతి బెడ్ మీద గురక, పట్టించిన సెల్ఫీ
దుబాయ్: మద్యం మత్తులో వెళ్లిన ఒక వ్యక్తి దర్జాగా యువతి ఫ్లాట్ లోకి వెళ్లి ఆమె బెడ్ మీద గురకపెట్టి నిద్రపోయాడు. ఉద్యోగ విధులు నిర్వహించి, ఇంటికి వచ్చిన యువతి విషయం గుర్తించి ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తాగుబోతును అరెస్టు చేసి తీసుకు వెళ్లారు.
ట్యూనీషియాకు చెందిన యువతి దుబాయ్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్నది. ఈమె దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నది. బుధవారం ఉద్యోగం ముగించుకుని తన ఫ్లాట్ కు వెళ్లింది. ఫ్లాట్ తలుపులు తీసి చూసింది. అంతే బెడ్ రూంలో తన మంచం మీద గుర్తు తెలియని వ్యక్తి నిద్రపోతున్న విషయం గుర్తించింది.

ఒంటరిగా ఉన్న ఆమె ఏమి చెయ్యాలో తెలియలేదు. అతను దొంగనా, లైంగిక దాడి చెయ్యడానికి వచ్చాడా అని తెలియక భయపడింది. వెంటనే సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దుబాయ్ పోలీసులను అలర్ట్ చేసి విషయం తెలియజేసింది.
పోలీసులు వచ్చినా అతను గురుకపెట్టి నిద్రపోతున్నాడు తప్పా లేవలేదు. అయితే అతను దొంగ కాదని పీకలదాక మద్యం సేవించి విపరీతమైన నిద్రవస్తే యువతి ఇంటికి వచ్చి నిద్రపోయాడని దుబాయ్ సీఐడి విభాగం అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సౌరి తెలిపారు.
అపార్ట్ మెంట్ లో సెక్యూరిటి గార్డు గా పని చేసే వ్యక్తి ఇతని స్నేహితుడని, అతని కోసం వచ్చి మద్యం మత్తులో తెలియక యువతి అపార్ట్ మెంట్ లో నిద్రపోయాడని పోలీసు అధికారులు అన్నారు. అయితే అక్రమంగా యువతి ఫ్లాట్ లో చోరబడ్డాడని అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications