Viral Video: రిపోర్టింగ్ అంటే ఇది.. ప్రాణాలు పోతున్నా ఆగని న్యూస్ కవరేజీ..
న్యూస్ కవరేజీ అంటే ఏముంది ఏదో చోటుకి వెళ్లి లోగో పట్టుకుని మాట్లాడితే అయిపోతుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. గతంలో చాలా మంది రిపోర్టర్లు న్యూస్ కవరేజీ చేస్తున్న సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. కొద్ది నెలల క్రితం జగిత్యాల జిల్లాలో వరదల్లో చిక్కున్న వారికి గురించి వార్త కవర్ చేయడానికి వెళ్లిన ఓ రిపోర్టర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

హరికేన్
తాజాగా అమెరికాలో హరికేన్ 'ఇయన్' బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, 200 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ సమయంలో ఓ వార్త ఛానల్ రిపోర్టరో 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల్లో రిపోర్టింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారీ గాలుల
వీడియోలో అతను రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నించగా.. భారీ గాలులతో అతను నిల్చోలేకపోయాడు. ఒకానొక సమయంలో అతను కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. 'నేను నిల్చులేకపోతున్నాను. గాలికి ఎగిరిపోతున్నాను' అంటూ అతడు అరవడం వినిపిస్తోంది. కానీ అతను ఓ పోల్ ను పట్టుకున్నాడు. చివరికి అతను ఓ ఇంటి దగ్గరకు వచ్చాడు.
4.2 మిలియన్ వ్యూస్
ఇందుకు సంబంధించిన వీడియోను గిఫ్డ్ స్పోర్ట్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్ట్ తో పాటు హరికేన్ సంబంధించి రిపోర్టింగ్ చేస్తుండగా చెట్టు కొమ్మ కొట్టుకొచ్చి జిమ్ కంటోర్ అనే రిపోర్టర్ కు తాకింది అని రాశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 4.2 మిలియన్ మంది చూశారు. వామ్మో ఇంత గాలిలో రిపోర్ట్ చేయడం సహాసమే అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
ఇళ్లలోకి షార్క్ లు
మరో పక్క భారీ వర్షాలు, గాలులకు ఫ్లోరిడా ఉక్కిరిబిక్కిరి అయింది. ఫ్లోరిడా నదిని తలపించింది. ఈ వరదల్లో
నగర వీధుల్లోకి షార్క్‌లు కొట్టుకొచ్చాయి. బుధవారం సాయంత్రం తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. తీరం నుంచి లోపలికి వెళ్లే క్రమంలో హరికేన్ తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications