Viral Video: రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. కానీ..
ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యం రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఇష్టమొచ్చినట్లు చేస్తారు. రైలు డోర్‌కి వేలాడడం, రైలు పట్టాలు దాటడం, డోర్ వద్ద నిల్చోని సెల్ఫీలు దిగడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడతారు. రైలు పట్టాలు దాటేటప్పుడు రైలు ఢీకొని చనిపోయినవారు కూడా ఉన్నారు.
రైలు పైకి ఎక్కేందుకు..
అందుకే రైళ్లలో, రైల్వేస్టేషన్ లో జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక మహిళ రైలు పైకి ఎక్కెందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆమెకు పైకి ఎక్కడు సాధ్యం కాలేదు. అయితే అప్పుడు పోలీస్ రావడంతో ఆమె కిందికి దిగేసింది. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు దీన్ని వీడియో తీశాడు.

3 లక్షలకు పైగా..
ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు మూడ లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లలో నవ్వులు పూయిస్తుంది. కొంచెం కష్టపడి ఉంటే పైకి ఎక్కేవారని ఒకరు కామెంట్ చేయగా.. సాహసం వద్దని మరో నెటిజన్ కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications