Viral Video: అన్నయ్య అంటే ఇతనే.. వైరల్ అయిన వీడియో
చెల్లెలు అంటే అన్నయ్యకు చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యం చిన్నతనంలో అన్నా చెల్లెళ్ల అల్లరి అంతాఇంత కాదు. కొట్టుకోవడం, తిట్టుకోవడం, మళ్లీ కలిసి ఉండడం. ఇవన్నీ చిన్నతనంలో కామన్. చెల్లిని ఎవరైనా ఏమన్న అంటే అన్నయ్య అస్సలు ఊరుకోడు. నా చెల్లినే అంటావా అంటూ గొడవకు దిగుతాడు. చెల్లిని కంటిరెప్పలా చూసుకుంటాడు.

మెట్టుగా..
ఓ అన్నయ్య చెల్లి కోసం మెట్టులా మారాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ చెల్లి టేబుల్ ఎక్కింది. దానిపై కాసేపు ఆడుకుంది. తర్వాత కిందికి దిగుదామని చూసింది.హైట్ ఎక్కువ ఉండడం వల్ల దిగడానికి వీలు కాలేదు. అక్కడే ఆమె అన్నయ్య మెట్టుగా మారి చెల్లిని కిందికి దించాడు.

2 లక్ష 90 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోను పుబిటీ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్టుతో పాటు ఈ సోదరుడు తన సోదరిని ట్రామ్పోలిన్ నుంచి కిందకు దింపాడు అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 2 లక్ష 90 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 22 వేల లైక్స్ రాగా 26 వందల మంది రీట్వీట్ చేశారు.
నెటిజన్లు ఫిదా
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అన్నయ్య అంటే ఇలానే ఉండాలని కామెంట్ చేస్తున్నారు. అన్నలుండగా చెల్లెళ్లకు భయమెందుకని కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications