Birth Day: సెక్యూరిటీ గార్డ్ బర్త్ డే చేసిన ఉద్యోగులు.. వీడియో వైరల్..
పుట్టిన రోజు నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకంగా ఉంటుంది. సంతోషకరమైన ఈవెంట్‌ను చాలా మంది వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ అందరూ ఇలా చేయలేరు.. ఎంతో మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. కొందరైతే దేశం విడిచి ఇతర దేశాల్లో పని చేస్తుంటారు. విదేశాల్లో పని చేస్తూ కుటుంబం కోసం డబ్బులు పంపుతూ ఉంటారు. ఏ పండుగొచ్చినా.. పబ్బమొచ్చినా వారే ఒంటరిగా జరుపుకుంటారు. ఇలానే ఓ సెక్యూరిటీ గార్డు ఇంటికి దూరంగా ఉంటున్నాడు.
అతను ఎనిమిదేళ్లుగా సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. ఈ ఎనిమిదేళ్లలో అతను ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. అయితే అతని పుట్టిన రోజు తెలుసుకున్న అతను పని చేసే ఆఫీస్ ఉద్యోగులు సెక్యూరిటీ గార్డుకు సర్ ప్రైస్ ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చిన సర్ ప్రైస్ సెక్యూరిటీ గార్డు భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరల్డ్ ఆఫ్ బజ్ నివేదిక ప్రకారం మలేషియాలోని ఓ కార్యాలయంలో ఎనిమిదేళ్లుగా పనిచేసిన సెక్యూరిటీ గార్డుకు తిరిగి ఇంటికి వచ్చే అవకాశం రాలేదు. దీంతో అతను ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఒంటరిగా జరుపుకునేవాడు. అతను పని చేసే కార్యాలయంలో ఉండే ఉద్యోగులు అతని బర్త్ డే నిర్వహించాలని నిర్ణయించారు. గార్డుని ముందుగా లోపలికి పిలిచారు. ఆ తర్వాత అక్కడ తన కోసం కేక్ ఆర్డర్ చేయడం చూసి భావోద్వేగానికి గురయ్యాడు.
గత ఎనిమిదేళ్లుగా మలేషియాలో నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుట్టినరోజు నాడు తన ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఏడ్చేవాడిని చెప్పారు. తాను పుట్టినరోజును ఎప్పుడూ జరుపుకోలేదని.. అయితే ఈసారి ఆఫీసు సిబ్బందితో చొరవతో పుట్టినరోజు జరుపుకున్నట్లు వివరించాడు. కేక్ కటింగ్ వేడుక ముగిసిన తర్వాత, ఒక ఉద్యోగి కన్నీళ్లు తుడవడానికి సెక్యూరిటీ గార్డుకు టిష్యూను ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఆఫీస్ సిబ్బందిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications