వీడియో: ఉత్తర కొరియాను ఎగదోస్తోన్న పుతిన్

North Korea: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

A video reportedly showing North Korean troops arriving at a Russia to fight against Ukraine

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది.

రోజులు గడుస్తున్నప్పటికీ ఉక్రెయిన్ అంత త్వరగా లొంగకపోవడం వల్ల రష్యా కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ యుద్ధంలో ఉత్తర కొరియా సహకారాన్ని తీసుకుంది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేజిన విజ్ఞప్తికి ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ సానుకూలంగా స్పందించారు. 12,000 ట్రూప్‌ల సైన్యాన్ని రష్యాకు పంపించారు.

ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది. ఉత్తర కొరియా పంపించిన ట్రూప్‌లో అత్యంత శక్తిమంతమైన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ సైతం ఉన్నట్లు నిర్ధారించింది. ఈ మేరకు సియోల్ కేంద్రంగా పని చేస్తోన్న దక్షిణ కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ యోన్‌హాప్ ప్రకటించింది.

ఉత్తర కొరియాకు చెందని 1,500 యుద్ధనౌకలు ఇప్పటికే రష్యా పోర్ట్ సిటీ వ్లాదివోస్టోక్‌కు చేరినట్లు వెల్లడించింది. రష్యా మిలటరీ యూనిఫాం ధరించి కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడే అవకాశం ఉందని యోన్‌హాప్ అంచనా వేసింది. నార్త్ కొరియా నుంచి బయలుదేరిన సైనికులు రష్యాలోని ఉస్సురియాస్క్, ఖబరోవ్‌స్క్, బ్లగొవెన్షెన్స్క్ వంటి నగరాలకు చేరినట్లు నిర్ధారించింది కూడా.

ఉత్తర కొరియా సైనికులు రష్యాకు చేరుకున్నారు. వారందరూ రష్యన్ మిలిటరీ బేస్ క్యాంప్‌కు వచ్చారు. రష్యా ఆయుధాల వినియోగంపై వారికి శిక్షణ ఇస్తారు. అలాగే- యుద్ధంలో ఇప్పటివరకు సాధించిన పురోగతినీ వివరిస్తారు. ఏయే ప్రాంతాలు తమ ఆధీనంలో ఉన్నాయో తెలియజేస్తారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ అనుసరిస్తోన్న యుద్ధ రీతులు, వ్యూహాలపై ఉత్తర కొరియా సైన్యానికి అవగాహన కల్పిస్తారు. దాన్ని ఎదుర్కొనడాకి తాము ఎలాంటి ప్రతి వ్యూహాలను పన్నారో? ఎలా ఎదురుదాడి చేయాలో? వివరిస్తారు. ఇది పూర్తయిన తరువాతే ఉత్తర కొరియా సైన్యాన్ని యుద్ధక్షేత్రంలో దింపుతుంది రష్యా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+