భార్య కోరిక: 400 ఎకరాల్లో పొద్దుతిరుగుడు (వీడియో)
న్యూఢిల్లీ: ఈ చిత్రంలోని మీకు కనిపిస్తున్న వ్యక్తులు డాన్ జాక్విష్, అతడి పిల్లలు. వారి చేతిలో ఉన్న ఫోటో అతడి భార్య బబ్బెట్‌ది. బబ్బెట్ 9 ఏళ్ల పాటు ఎముకల క్యాన్సర్‌తో పోరాడి గతేదాడి నవంబర్‌లో చనిపోయింది.
ఆమె గుర్తుగా అమెరికాలోని విస్కాన్సిన్ నగర హైవే 85కి చుట్టూ 400 ఎకరాల్లో 7కిలోమీటర్ల మేర పొద్దుతిరుగుడు మొక్కలను జాక్విష్ నాటాడు. క్యాన్సర్‌కు మందు కనుక్కోవడానికి జరిగే పరిశోధనలకు ఈ పొద్దుతిరుగుడు విత్తనాలను విక్రయించగా వచ్చే డబ్బును పరిశోధన కేంద్రాలకు దానం చేయాలని బబ్బెట్ కోరిక.

తన భార్య కోరిక మేరకు 400 ఎకరాల్లో పొద్దుతిరుగుడు మొక్కలను నాటినట్లు ఆయన వెల్లడించారు. క్యాన్సర్‌ను జయించేందుకు తన భార్య 9ఏళ్లలో దాదాపు 22 రకాల చికిత్సలు చేయించుకుందని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications