Italy: ఇటలీ పార్లమెంట్‍లో అరుదైన ఘటన.. హాల్‍లో బిడ్డకు పాలిచ్చిన ఎంపీ..

ప్రపంచంలో అత్యంత గొప్పది అమ్మ ప్రేమ.. పిల్లల కోసం తన సర్వస్వాన్ని దారపోస్తోంది అమ్మ. తాను ఆకలితో అలమటించినా.. తన బిడ్డ కడుపు నిండాలని చూస్తుంది. బిడ్డ ఆకలితో ఏడిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా.. తల్లి బిడ్డకు పాలిస్తుంది. ఇలాంటి ఘటనే ఇటలీ పార్లమెంట్ లో జరిగింది. ఒక మహిళా ఇటాలియన్ పార్లమెంటేరియన్ తన బిడ్డ ఆకలితో ఏడిస్తే అదే పార్లమెంట్ తన బిడ్డకు పాలిచ్చింది.

ఇటాలియన్ మహిళా ఎంపీ పేరు గిల్డా స్పోర్టియెల్లో పార్లమెంట్ లో తన బిడ్డ ఫెడెరికోకు పాలు పట్టింది. బిడ్డ ఆకలితో ఉంటే ప్రదేశం ఏదైని చూడకూండా బిడ్డ ఆకలి తీర్చిన ఆ మహిళ ఎంపీని పార్లమెంట్ సభ్యులు ప్రశంసించారు. పురుషాధిక్య ఇటలీ సమాజ పార్లమెంటులో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్‌ అభినందించారు.

A woman MP breastfed her baby in the Italian Parliament

తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు తాగిన బిడ్డకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. తల్లి పాలలో కొవ్వు, చక్కెర, నీరు, ప్రోటీన్, విటమిన్ల ఉంటాయి. తల్లి పాలుచాలా సులభంగా జీర్ణం అవుతాయి. తల్లి పాలలో సూక్ష్మక్రిములు, వైరస్‌లతో పోరాడడంలో శిశువులకు సహాయపడే ప్రతిరోధకాలు లభిస్తాయి.

తల్లిపాలు బాల్య స్థూలకాయాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. అధ్యయనాల ప్రకారం, నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డ అధిక బరువు లేదా ఊబకాయంతో పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుందట. తల్లిపాలు తాగే శిశువులు తెలివిగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+