స్మార్ట్ ఫోన్ కోసం.. బట్టలిప్పేసిన యువతి

మాస్కో : అరచేతుల్లో ప్రపంచాన్ని ఇమడ్చే స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పటి యువతకి యమా క్రేజ్. ఛాటింగ్స్, గేమింగ్స్, ఇంటర్నెట్.. లతో రోజు మొత్తం కాలక్షేపం చేసేస్తుంటారు. పక్కన ఎవరున్నా.. లేకపోయినా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, బయటి ప్రపంచాన్ని మరిచిపోయి తమదైన ప్రపంచంలో విహరిస్తుంటారు.

ఆన్ లైన్ ఆధారంగా ఇంట్లో కూర్చునే పనులు చక్కబెట్టుకునే వీలు కూడా ఉండడంతో ప్రతి మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఇప్పుడో తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇదే క్రమంలో స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటి యువత దేనికైనా రెడీ అంటున్నారు. తాజాగా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన డిమిత్రి షిలోవ్ అనే రష్యన్ బ్లాగర్ యువతలో స్మార్ట్ ఫోన్ పై ఎంత క్రేజ్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఇదే విషయాన్ని ప్రయోగాత్మకంగా రుజువు చేయడం కోసం మరో ఇద్దరు యువకులతో కలిసి రష్యాలోని కొంతమంది యువతులను కలిశాడు. స్మార్ట్ ఫోన్ ని ఫ్రీ ఆఫర్ గా చేస్తాం.. అందుకు ప్రతిఫలంగా మీరేం చేస్తారు..? అంటూ సదరు యువతులను ప్రశ్నించారు.

A woman ready to do anything for smart phone

అయితే కొంతమంది అమ్మాయిలు దేనికైనా రెడీ చెప్పగా, మరికొంతమంది మాత్రం 'సెక్స్' తప్ప, దేనికైనా రెడీ అని చెప్పారు. ఇంకొందరు మాత్రం తమ పాత ఫోన్ ఇచ్చేసి కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకుంటామని బదులిచ్చారు.

ఇదే తరహాలో కేసేనియా అనే యువతికి స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేయగా, ఎలాంటి షరతులకైనా తాను 'ఓకె' అని డిమిత్రి షిలోవ్ టీమ్ కి చెప్పింది. దీంతో, 'లో దుస్తులు తప్ప మిగతా బట్టలన్ని విప్పేసి ఒంటి మీద ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలని, ఈ తతంగాన్నంతా తాము వీడియో తీస్తామని' సదరు యువతికి కండీషన్ పెట్లారు. అన్నింటికీ ఓకె చెప్పిన కేసేనియా వాళ్లు చెప్పినట్టుగానే బట్టలన్ని విప్పి ఇంజిన్ ఆయిల్ ఒంటి మీద పోసుకుని ఫోటోలకు పోజులిచ్చింది.

ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోన్న ఈ వీడియో పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లల స్థాయిని దిగజార్చేలా కేసేనియా ప్రవర్తించిందంటూ పలువురు దుమ్మెత్తి పోస్తోంటే, ఇంకొంతమంది మాత్రం వీడియో ద్వారా కేసేనియా చాలా పాపులర్ అయిందంటూ కితాబిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+