Divorce: విడాకులొచ్చాయని బంగీ జంప్.. పడితే బొక్కలిరిగినయి..
సాధారణంగా పెల్లి కుదిరితేనో లేక ఏదైన శుభవార్త ఉంటేనో సెలబ్రషన్స్ చేసుకుంటాం. కానీ ఈ మధ్య విడాకులు వచ్చినా సెలబ్రెషన్స్ చేసుకుంటున్నారు.నార్త్ కరోలీనాకు చెందిన లారెన్ బ్రూక్ అనే మహిళ తన విడాకులను కూడా ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. లారెన్ అందమైన రెడ్ కలర్ గౌను ధరించి, చేతిలో డైవోర్స్‌డ్ అనే బ్యాండ్‌ను పట్టుకొని ఫోటో షూట్ కూడా చేసింది. తాజాగా ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న సందర్భంగా బంగీ జంప్‌కు వెళ్లి మెడలు విరగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రెజిల్‌కు చెందిన రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా అనే యువకుడు 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జీవితంలో ఇక ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా 70 అడుగుల ఎత్తులో బాంగీ జంప్ చేయాలనుకున్నాడు.తన స్నేహితుడు, అతని కజిన్‌తో కలిసి బ్రిడ్జ్ స్వింగ్ చేయడానికి వెళ్లాడు. కానీ తాడు తెగి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి.

ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలోగల లగోవా అజుల్ అనే టూరిస్ట్ స్పాట్ వద్ద గత ఫిబ్రవరి 11న ఈ ఘటన జరిగింది. "నేను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ ఇటీవల పరిస్థితులు మారిపోయాయి. విడాకుల తర్వాత, నేను జీవితాన్ని అన్ని విధాలుగా ఆనందించాలనుకుంటున్నాను. కానీ ఇలా జరిగింది" అని రఫేల్ అన్నారు. ఈ సంఘటన రోజును గుర్తు చేసుకుంటూ.. ఆ రోజున తాను నిజంగా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
"నేను చాలా బలమైన నొప్పిని అనుభవించినట్లు నాకు గుర్తుంది. నా జీవితంలో ఇంతకంటే దారుణమైన నొప్పి ఎప్పుడూ అనుభవించలేదు" అని తెలిపాడు.
ఇప్పుడు ఇంటెన్సివ్ థెరపీలో ఉన్న రాఫెల్.. ఈ ప్రమాదం తనకు శాశ్వత గాయాలను మిగిల్చిందని, జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని చెప్పాడు.
"నా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు. నేను ఇంతకు ముందు ఉన్న రాఫెల్‌గా ఉండకూడదనుకుంటున్నాను. నేను సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండాలి, ఇది ఇప్పటికే చాలా పెద్ద విషయం" అని చెప్పాడు.












Click it and Unblock the Notifications