రెచ్చగొట్టారు: రక్తం కళ్ల చూసిన చిన్నారి (వీడియో)
పాలస్తీనా: చిన్నపిల్లల దగ్గర చిన్నచిన్న ఆయుధాలు ఉంటే వాటిని ఎలా ఉపయోగించాలి అని పెద్దలు జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే ఓ పాలస్తీనా చిన్నారి చేతిలో కత్తి ఉంటే ఎదుటి వ్యక్తి పొడిచేందుకు ఉసి గొల్పుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

చిన్నారి బంధువు నీ రక్తం కళ్ల చూస్తా అంటూ ఉంటే ఆ చిన్నారి సైతం మీ రక్తాన్ని చిందిస్తానంటూ బిగ్గరగా అరుస్తున్న వీడియో ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కొందరు వింతగా చూస్తున్నారు. కొందరు అసహ్యించుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చివరికి బాలుడు తన బంధువు రక్తం కళ్ల చూశాడు. రక్తం రావడంతో భయంతో వెళ్లి ఓ బోర్డులో దాక్కున్నాడు. అయినా బాలుడి కుటుంబ సభ్యులు మళ్లి రెచ్చగొట్టి పొట్లాటకు లాగారు. ఇప్పుడు ఈ చిన్నారి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.












Click it and Unblock the Notifications