వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ అంతు చూస్తున్న ఇరాకి ర్యాంబో (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇరాక్/సిరియా: ప్రపంచ అగ్రదేశాలకు సవాలు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్)కు ఇప్పుడు వారి సొంత గడ్డ మీద మరొ వ్యక్తి పెద్ద సమస్యగా తయారైనాడు. విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఊచకోత కోస్తున్నాడు.

ఇరాక్, సిరియా, లిబియా దేశాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అంతం చూస్తూ అక్కడి ప్రజలకు దేవుడు అయ్యాడు. అతడే ఓ సైన్యం తయారు చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మీద యుద్దం చేస్తున్నాడు.అక్కడి ప్రజలు అతనిని ముద్దుగా డెత్ ఆఫ్ ఏంజిల్ అని పిలుస్తున్నారు.

ది ఇమామ్ ఆలీ బ్రిగేడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు అబు అజ్రెల్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాడు. అతడు ఓ చేతిలో అత్యాధునిక ఏకే-47 ఆయుధం, మరో చేతిలో పదునైన గొడ్డలి పట్టుకుని నలుపు రంగులో ఉన్న ఆర్మీ లాంటి దుస్తులు వేసుకుని తిరుగుతున్నాడు.

Abu Azrael also known as ‘Iraqi Rambo’

అబు అజ్రెల్ కు ఇరాకి ర్యాంబో అని పేరు పెట్టి పోస్టర్లు వేయిస్తున్నారు. ఇతని సైన్యంలో చేరడానికి ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకులతో పాటు యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలలో అంతం అయిన వారి కుటుంబ సభ్యులు అబుకు అండగా ఉంటున్నారు.

నాకు ప్రాణాలు అంటే లెక్కలేదు, ఇస్లామిక్ స్టేట్ అరాచకాలు అంతం చేసే వరకు పోరాడుతా, ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నారు, వారిని అంతం చేసే వరకు నిద్రపోనని అబు అజ్రెల్ అంటున్నాడు. ఇప్పటి వరకు అబు 1,500 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతం చేశాడు.

అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలకు నిద్రలేకుండా చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సైతం అబు అజ్రెల్ పేరు చెబితే హడలిపోతున్నారు. అబును ఎలాగైనా అంతం చెయ్యాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Angel of Death, Abu Azrael also known as ‘Iraqi Rambo’, who has killed 1,500 Islamic State members. Azrael said in a video that, We tell Saudi Arabia were coming to you from Yemen or wherever. It doesn’t matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X