కన్నబిడ్డను తల్లి ఇంత ఘోరంగా.. (వీడియో)
శ్రీలంక : స్నానం చేయలేదన్న చిన్న కారణంతో.. తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఓ తల్లి తన కన్నబిడ్డను గొడ్డును బాదినట్టు బాదింది. చేతికి దొరికిన వస్తువుతో ఆ చిన్నారని కొడుతూ.. చెవులు పిండుతూ.. జుట్టు పట్టి ఈడ్చుతూ.. ఆ తల్లి అత్యంత పాశవికంగా వ్యవహరించిన తీరు శ్రీలంక అంతటా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ వ్యవహారమంతా ఇంటర్నెట్ లోకి ఎలా ఎక్కిందో తెలియదు గానీ.. వీడియో కాస్త వైరల్ కావడం.. అధికారుల ద్రుష్టిలో పడడంతో సదరు తల్లి కటకటాలపాలైంది. శ్రీలంకలోని జాఫ్నాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కూతురిని దగ్గరికి రావాలంటూ తొలుత బెదిరించిన తల్లి.. ఆ చిన్నారి దగ్గరికి రాగానే జుట్టు పట్టి ఈడ్చి ఈడ్చి కొట్టింది.
కత్తిలాంటి వస్తువును చేతిలోకి తీసుకుని చిన్నారి వీపుపై పలుమార్లు కొట్టింది ఆ తల్లి. తల్లి అంతలా కొడుతుంటే.. నిస్సహాయంగా ఏడుస్తూ ఉండిపోయింది తొమ్మిదేళ్ల ఆ చిన్నారి. పిల్లలపై కోపముంటే ఉండవచ్చు గానీ మరీ ఇంతలా వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications