Actress: రోడ్డు పక్కన శవమైన ఫేమస్ నటి, భర్త, కారు డ్రైవర్ అరెస్టు, ఇంటి నుంచి వెళ్లి మాయం, చివరికి !

ఢాకా/ముంబాయి: ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మహిళకు వివాహం అయ్యింది. స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఎవ్వరికీ కనపడకుండా పోయింది. భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నటి కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు నటి కోసం గాలించారు. సిటీ సమీపంలోని ఫ్లేఓవర్ సమీపంలోని ఓ గోనె సంచిలో మహిళ శవమై కనిపించింది. కొన్ని రోజుల క్రితం మాయం అయిన నటి ఆ గోనె సంచి మూటలో శవమై కనిపించిందని వెలుగు చూడటం కలకలం రేపింది. నటిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి ఫ్లైఓవర్ సమీపంలో విసిరేశారని పోలీసులు గుర్తించారు. నటి కేసులో ఆమె భర్తతో పాటు అతని కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 ప్రముఖ నటి

ప్రముఖ నటి

బంగ్లాదేశ్ లోని ఢాకాలో నివాసం ఉంటున్న రైమా ఇస్లాం శిము అలియాస్ రైమా శిము (45) బంగ్లాదేశీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 45 సంవత్సరాల వయసు ఉన్న రైమా ఇస్లాం శిము 1998 బర్త్ మాన్ అనే సినిమాతో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు 25కు పైగా సినిమాల్లో నటించిన రైమా ఇస్లాం శిము బంగ్లాదేశ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

 వివాహం చేసుకున్న నటి

వివాహం చేసుకున్న నటి

బంగ్లాదేశీ నటి రైమా ఇస్లాం శిము ఇప్పటికే షఖావత్ ఆలీ నోబల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్త షఖావత్ ఆలీతో కలిసి రైమా ఇస్లాం శిము ఢాకాలో నివాసం ఉంటున్నది. అయితే నటి రైమా ఇస్లాం శిము, ఆమె భర్త షఖావత్ ఆలీల మద్య కొంతకాలం చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన నటి

ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన నటి

ఇటీవల రైమా ఇస్లాం శిము ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఎవ్వరికీ కనపడకుండా పోయింది. ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రైమా ఇస్లాం శిము మాయం కావడం హాట్ టాపిక్ అయ్యింది. స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన రైమా ఇస్లాం శిము ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఎవ్వరికీ కనపడకుండా పోవడం బాంగ్లాదేశ్ లో కలకలం రేపింది.

ఫ్లైఓవర్ కింద శవమైన నటి రైమా

ఫ్లైఓవర్ కింద శవమైన నటి రైమా

నటి రైమా ఇస్లాం శిము కనపడకపోవడంతో ఆమె భర్త షాఖావత్ ఆలీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నటి కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, రైమా ఇస్లాం శిము అభిమానులు ఆ నటి కోసం గాలించారు. కరణిగంజ్ సమీపంలోని హజరత్ పుర సమీపంలోని ఫ్లేఓవర్ సమీపంలోని ఓ గోనె సంచిలో మహిళ శవమై కనిపించింది. గోనె సంచిలో ఉన్న మహిళ నటి రైమా ఇస్లాం శిము అని పోలీసులు గుర్తించడంతో ఆమె అభిమానులు హడలిపోయారు.

 నటి హత్య కేసులో భర్త, కారు డ్రైవర్ అరెస్టు

నటి హత్య కేసులో భర్త, కారు డ్రైవర్ అరెస్టు

కలబాగన్ పోలీసులు రైమా ఇస్లాం శిము శవాన్ని సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ (ఎస్ఎస్ఎంసీహెచ్)కి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నటి రైమా ఇస్లాం శిము హత్య కేసుకు సంబంధించి ఆమె భర్త షాఖావత్ ఆలీతో పాటు అతని కారు డ్రైవర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నటి రైమా ఇస్లాం శిము హత్యకు గురై గోనె సంచిలో శవమై కనిపించడం బంగ్లాదేశ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+