అమ్మ-నాన్న ముద్దు పెట్టుకుంటే చాలు.. ఏడుపందుకుంటోన్న బుజ్జాయి(వీడియో)
న్యూయార్క్ : ముద్దులొలికే బుజ్జాయిల అల్లరి చేష్టల్ని కెమెరాల్లో బంధించి మురిసిపోతుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఇంకా మాటలు కూడా రాని చిన్నారులు.. కళ్లెదుట అగుపించే దృశ్యాలను చూసి.. భలే ఆశ్చర్యంగా స్పందిస్తుంటారు. ఇలాంటి కోవలోకే చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ ముద్దులొలికే చిన్నారి.. తల్లిదండ్రులు తన ఎదుటే ముద్దుపెట్టుకుంటుంటే భోరమని ఏడుపు లంకించుకుంటుంది. వారిద్దరు ముద్దు నుంచి దూరం జరగ్గానే.. మళ్లీ మామూలే. అలా వారిద్దరు ముద్దుపెట్టుకున్నప్పుడు పాపాయి ఏడుస్తుండడం గమనించిన సదరు తల్లిదండ్రులు.. ఆ దృశ్యాలను తమ కెమెరాలో రికార్డు చేసి యూట్యూబ్‌లోకి ఎక్కించారు.
ఇంకేముంది.. ఇది కాస్త ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారిపోయింది. కానీ, ఈ బుజ్జాయి ఏడుపులో ఉన్న లాజిక్ మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ముద్దుపెట్టుకుంటే చాలు.. ఏడపందుకోవడమే. అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన మ్యాత్-క్రిస్నీ దంపతుల తమ బుజ్జాయి అల్లరిని ఇలా కెమెరాతో బంధించారు. మ్యాథ్ హన్నెకన్ అనే మరో నెటిజెన్ దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో.. బేబీ ఫన్నీ వీడియోల్లో ఇప్పుడీ వీడియో దూసుకుపోతుంది.












Click it and Unblock the Notifications