106ఏళ్ల బామ్మ ఒబామాతో చిందేసింది(వీడియో)
వాషింగ్టన్: ఆమె 106ఏళ్ల ఓ బామ్మ. ఆమె ఉత్సాహం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్టెప్పులేయించింది. సతీసమేతంగా ఒబామా ఆ బామ్మతో కలిసి డ్యాన్స్ చేశారు. కాగా, వైట్‌హౌజ్‌లో ఆవిష్కృతమైన ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
అమెరికాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వర్జీనియా మెక్‌లౌరిన్ అనే 106ఏళ్ల వృద్ధురాలికి ఎప్పట్నుంచో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు వెళ్లాలని కోరిక. దీనికోసం ఇటీవల ఒబామాకు దరఖాస్తు పెట్టుకుంది. స్పందించిన ఒబామా ఆమెను ఆహ్వానించగా.. ఆదివారం ఆ వృద్ధురాలు అక్కడికి చేరుకుంది.

ఒబామా తన సతీమణి మిచెల్లీతో కలిసి వర్జీనియా దగ్గరకు వచ్చారు. వాళ్ల రాకను గమనిస్తూనే ఆ బామ్మ ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయింది. స్టెప్పులేస్తూ ఒబామా దంపతులను పలుకరించింది. ‘నాతో డ్యాన్స్ చేసే సత్తా మీకుందా?' అంటూ వారికి సవాల్ విసిరింది. దీంతో మిచెల్లీ ఊరుకోలేదు.. ఆమెతో కలిసి స్టెప్పులేశారు.
ఆ తర్వాత తన భర్త ఒబామాతో కూడా వేయించింది. ఇంత వయసులో ఉత్సాహంగా వర్జీనియా డ్యాన్స్ చేయడాన్ని చూసి ఒబామా ఆశ్చర్యపోయారు. వైట్‌హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం తనకు దక్కుతుందని ఊహించలేదని వర్జీనియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నల్లజాతీయుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని, తానూ నల్లజాతీయురాలినేనని తెలిపింది
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications