మహిళ ఎలా బతికిందంటే.. అదృష్టం, అద్భుతం: జారిపడి సముద్రంలోనే 10గం.లు
లండన్: ఎవరైనా సముద్రంలో పడిపోతే బతికే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ యూకే మహిళ ఒకరు సముద్రంలో పడి పది గంటలకు పైగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెను కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ఆమె ఓ ఎయిర్ హోస్టెస్ అని తెలుస్తోంది. శనివారం రాత్రి పడిపోగా, ఆదివారం బయటకు తీశారు.
బ్రిటన్‌కు చెందిన సదరు యువతి క్రొయేషియాకు చెందిన నార్వేజియన్ స్టార్ ఓడలో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తోంది. పడవ అంచున నిలబడిన ఆమె తన స్నేహితులతో మాట్లాడుతోంది. ఆ సమయంలో కాలుజారి సముద్రంలో పడిపోయింది.

సముద్రంలో పడిపోయిన మహిళ
ఆమె పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీర ప్రాంతానికి అరవై మైళ్ల దూరంలో ఉంది. ఆమె సముద్రంలో పడిపోవడాన్ని గమనించిన ప్రయాణీకులు వెంటనే ఓడ కెప్టెన్‌కు సమాచారం అందించారు. వారు అధికారులకు తెలియజేశారు. దీంతో నేవీ అధికారులు రంగంలోకి దిగారు.

అలా రక్షించారు
గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ నేవీ, తీర ప్రాంత అధఇకారులు పీసీ 9 విమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ మహిళను కాపాడారు. ఈ విషయాన్ని ఆమె మీడియాకు తెలిపారు. ఆమె వయస్సు 46. క్రొయేషియాలోని పులా సమీపం వర్గరోలా పోర్ట్ నుంచి వెళ్లిన ఓడలో ఆమె ప్రయాణించింది.

బతకడం అద్భుతం, ఆశ్చర్యం
ఆమెను రక్షించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఆసుపత్రి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బ్రిటిష్ మహిళను కాపాడి ఆసుపత్రికి తీసుకు వచ్చారని, ఆమె పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరోవైపు, దీనిపై క్రొయేషియా మినిస్ట్రీ ఆఫ్ మారిటైమ్ అఫైర్స్ అధికార ప్రతినిధి డేవిడ్ రాడాస్ మాట్లాడుతూ.. ఆమె కాలు జారి సముద్రంలో పడిందా లేక క్రూయిజ్ షిప్ నుంచి దూకిందా తెలియాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బ్రిటిష్ మహిళ బతకడంపై ఓడ కెప్టెన్ మాట్లాడుతూ.. ఓ మహిళను కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మహిళ బతికి బయటపడటం లక్కీ, అద్భుతం అని అంటున్నారు.

ఇలా బతికానని చెప్పిన మహిళ
సముద్రంలో పడిపోయి పది గంటల పాటు అందులోనే ఉన్నానని ఆ మహిళ చెప్పారు. అంతసేపు సముద్రంలో ఎలా ఉండగలిగారని ప్రశ్నిస్తే యోగా ఫిట్‌నెస్, పాటలు తాను అన్ని గంటలు బతికేందుకు ఉపయోగపడ్డాయని ఆమె చెప్పారు. తాను యోగా చేస్తానని, దీని వల్ల ఫిట్‌గా ఉన్నానని ఆమె చెప్పారు. అలాగే, రాత్రంతా సముద్రంలో ఉంది. సముద్రం చల్లదనం ఫీల్ నుంచి బయటపడేందుకు ఆమె పాటలు పాడారని చెప్పారట. తాను వెనుక వైపు ఉన్న సమయంలో కిందపడ్డానని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications