పాకిస్థాన్‌పై డ్రోన్ దాడి.. ఎయిర్‌బేస్ లక్ష్యంగా భీకర దాడులు!
ఆసియా ఖండంలో మరో యుద్ధ మేఘం కమ్ముకుంది. దశాబ్దాల వైరం ఇప్పుడు గగనతల యుద్ధంగా రూపాంతరం చెందింది. సోమవారం తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ విమానాలు, పాకిస్థాన్‌లోని అత్యంత కీలకమైన సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఇది కేవలం దాడి కాదు.. పాక్ అహంకారాన్ని దెబ్బతీసే 'ప్రతీకార గర్జన' అని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ బాహాటంగా ప్రకటించింది.
పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండి, ఆ దేశ వైమానిక శక్తికి కేంద్ర బిందువుగా ఉన్న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ (Nur Khan Airbase) మరోసారి ధ్వంసమైంది. గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ జరిపిన దాడుల గాయాల నుంచి కోలుకోకముందే, ఇప్పుడు ఆఫ్ఘన్ వైమానిక దళం దీనిని లక్ష్యంగా చేసుకుంది. నూర్‌ఖాన్‌తో పాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఇతర వ్యూహాత్మక స్థావరాలపై ఆఫ్ఘన్ బాంబుల వర్షం కురిపించింది.

ప్రతీకారేచ్ఛ.. Pakistan పైలట్ బందీ!
తమ భూభాగంలోకి పాక్ చొరబడి చేసిన దాడులకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఆఫ్ఘన్ తెలిపింది. యుద్ధం కేవలం గగనతలానికే పరిమితం కాలేదు.. తూర్పు ఆఫ్ఘన్ నగరమైన జలాలాబాద్ ఆకాశంలో ఒక పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని తాలిబన్ దళాలు కూల్చివేశాయి. ఆ విమాన పైలట్‌ను బందీగా పట్టుకోవడం పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ. తమ రక్షణ కవచాలను ఛేదించి మరీ ఆఫ్ఘన్ దళాలు రావల్పిండి వరకు రావడం పాక్ నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
నలిగిపోతున్న నూర్‌ఖాన్.. పాక్‌కు తీరని నష్టం
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌ను రిపేర్ చేసుకుంటున్న తరుణంలోనే మళ్ళీ దాడులు జరగడం పాక్ వైమానిక సామర్థ్యాన్ని కుంగదీసింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సరిహద్దుల్లో యుద్ధం.. పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు దక్షిణాసియాలో శాంతి భద్రతలకు పెను సవాలుగా మారాయి.
🚨First visuals emerge of an Afghan Taliban armed drone targeting Pakistan’s most sensitive Nur Khan Airbase in Rawalpindi Security collapse again? All talk, only press conferences?📷 pic.twitter.com/A67ctf4Smm
— Bharat Yojna (@KumarR20865) March 2, 2026
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
పాకిస్తాన్ తో యుద్ధం వేళ.. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంప బీభత్సం -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications