భార్య చెవులు కోసిన కిరాతకుడు: పరాయి వ్యక్తితో మాట్లాడినందుకే
భార్య పరాయి మగవాడితో మాట్లాడిందన్న కారణంతో.. అమాంతం ఆమె మీద కత్తితో దాడి చేశాడు భర్త. భర్త
కాబుల్: ఆఫ్ఘన్ లో మహిళల పట్ల ఆకృత్యాలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. భార్యలను శారీరకంగా మానసికంగా హింసిస్తోన్న ఘటనలు నిత్యం ఎక్కడో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ రెండు చెవులు కోసి ఇంటి నుంచి పరారయ్యాడు ఓ ప్రబుద్దుడు.
భార్య పరాయి మగవాడితో మాట్లాడిందన్న కారణంతో.. అమాంతం ఆమె మీద కత్తితో దాడి చేశాడు భర్త. భర్త దాడిలో జరీనా(23) తీవ్రంగా గాయపడింది. ఆప్ఘనిస్థాన్ లొని కషిండా జిల్లా మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జరీనా ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా.. మాటల మధ్యలోనే ఆమె భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ప్రస్తుతం జరీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 13
ఏళ్ల వయసులోనే తనకు పెళ్లి చేశారని, భర్తతో అనుబంధం అసలేమాత్రం బాగోలేదని జరీనా వాపోతుంది.
కనీసం తల్లిదండ్రులను చూడటానికి కూడా తన భర్త అంగీకరించడం లేదని, అలాంటి భర్తతో ఇక ఏమాత్రం కలిసి ఉండాలని తాను కోరుకోవడం లేదని జరీనా తెలిపింది. ఎప్పుడూ తన పట్ల అనుమానంగానే ఉంటాడని, అనరాని మాటలతో వేధిస్తుంటాడని ఆవేదన చెందింది. అతన్ని వెంటనే అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని జరీనా కోరుతోంది.












Click it and Unblock the Notifications