ఏంటీ ఘోరం.. 45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల బాలికతో పెళ్లి.. 9 ఏళ్లు వచ్చాక కాపురానికి అట..!

అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారి గొంతు కోశాడు ఆ తండ్రి. డబ్బు కోసం 45 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసి అమ్మేశాడు. ఇప్పుడీ ఘటన సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌ లో జరిగిన ఈ ఘటన వింటే అక్కడి మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఆడపిల్ల పుట్టడమే ఆ రాజ్యంలో శాపంగా మారింది.

ముక్కుపచ్చలారని ఆ చిన్నారికి ఓ కసాయి తండ్రి జీవితకాలం శిక్ష వేశాడు. అభంశుభం తెలియని ఆ ఆరేళ్ల చిన్నారికి 45 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించాడు. డబ్బు కోసం కన్న కూతుర్ని అమ్మేశాడు. ఈ ఘటన చూస్తే తాలిబన్ ల రాజ్యం అయిన ఆఫ్గనిస్థాన్ లో మహిళలు, చిన్నారుల పరిస్థితి ఏంటో కళ్లకు కట్టినట్లు అర్థం అవుతోంది.

Afghanistan Horror Father Sells 6-Year-Old Daughter to 45-Year-Old Man for Cash

ఈ షాకింగ్ ఘటన ఆఫ్గనిస్థాన్ లోని హెల్మాంద్ ప్రావిన్స్ లోని మార్జా జిల్లాలో జూన్ 28న జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబం తమ ఆరేళ్ల చిన్నారిని అమ్ముకుంది. 45ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఈ విషయంలో తాలిబన్ లు జోక్యం చేసుకుని చిన్నారికి 9 ఏళ్లు వచ్చాకే కాపురానికి పంపాలని షరతులు విధించారు.

ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని గతంలో ప్రగల్భాలు పలికిన తాలిబన్ లు ఇప్పుడు ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఈ వివాహం స్థానిక 'వాల్వార్' సంప్రదాయం ప్రకారం జరిగినట్లు సమాచారం.

స్థానిక వార్తాపత్రిక కథనం ప్రకారం ఆరేళ్ల చిన్నారికి వివాహం చేసుకున్న ఆ వ్యక్తికి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ చిన్నారి తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. అయితే ఈ ఘటన గురించి తాలిబన్ పెద్దలకు తెలిసింది. అయితే వాళ్లు.. ఈ పెళ్లిని ఆపాల్సింది పోయి.. బాలికకు 9 ఏళ్లు వచ్చాకే కాపురానికి పంపాలని షరతులు పెట్టారు. దీంతో అక్కడి తాలిబన్ పెద్దలు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+