ఆఫ్ఘనిస్తాన్‌లో కీలక పరిణామాలు: ఇక పూర్తిస్థాయిలో..27 మందితో

కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. తమ అధికార పరిధిని మరింత విస్తరించుకున్నారు. మంత్రివర్గాన్ని విస్తరించుకున్నారు. పలువురు కొత్తవారికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రక్షణ, విదేశాంగ మంత్రిత్య శాఖలు సహా పలు విభాగాలకు అధిపతులను నియమించారు.

ఈ మేరకు పఝ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ ఏజెన్సీ కొద్ది సేపటి కిందటే ఈ సమాచారాన్ని వెల్లడించింది. మంత్రులు, ఉప మంత్రులు, సహాయ మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లతో కూడిన ఓ జాబితాను విడుదల చేసింది. తాత్కాలిక ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పేరును ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వం పేరుతో ఈ జాబితా విడుదలైంది. 27 మంది మంత్రులు, ఉప మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు కేటాయించిన పోర్ట్ ఫోలియోలను కూడా ఇందులో పొందుపరిచారు.

 Afghanistan: Taliban interim cabinet expanded more than two dozen ministers and deputy ministers appoint

తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముల్లా హెబతుల్లా అఖుండ్జాదా ఆదేశాలను ఈ జాబితాను రూపొందించామని, దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకునే సర్వాధికారులు ఆయనకే ఉన్నాయని జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. త్వరలోనే వారంతా బాధ్యతలను స్వీకరిస్తారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఇక పూర్తిస్థాయిలో నడిపించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే మంత్రివర్గాన్ని విస్తరించామని స్పష్టం చేశారు.

ఈ లిస్ట్ ప్రకారం.. గనులు, పెట్రోలియం శాఖ మంత్రిగా మౌలావి షహబుద్దీన్ దెలావర్ నియమితులయ్యారు. ఆ శాఖ ఉప మంత్రిగా హాజీ ముల్లా మహ్మద్ ఇసా అఖుండ్ అపాయింట్ అయ్యారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖను ముల్లా మహ్మద్ అబ్బాస్ అఖుండ్, మౌలావి షరాఫద్దీన్, మౌలావి ఇనాయతుల్లా అదే శాఖకు డిప్యూటీలుగా నియమితులయ్యారు. నేషనల్ ప్రొక్యూర్‌మెంట్ అథారిటీ, సుప్రీం ఆడిట్ ఆఫీస్‌లకు కొత్తగా ఉన్నతాధికారులను నియమించింది తాలిబన్ల ప్రభుత్వం.

గిరిజనుల వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, సమాచారం-సాంస్కృతిక శాఖలకు కొత్తగా ఉప మంత్రులను నియమించినట్లు జబీహుల్లా తెలిపారు. ఇంధనం, కమ్యూనికేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వంటి కీలక శాఖలకు ఉప మంత్రులను నియమించారు. తాలిబన్ల ప్రధాన కేంద్రం కందహార్‌లోని ఎయిర్‌పోర్ట్ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారు. కందహార్ విభాగానికి తాలిబన్ల సీనియర్ నాయకుడు మౌలావి ఫతుల్లా మన్సూర్‌కు ఎయిర్ పోర్ట్ బాధ్యతలను అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+