పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆప్ఘాన్‌లో ఆందోళనలు: కాల్పులు జరిపి స్నేహం బయటపెట్టిన తాలిబన్లు
కాబూల్: తాలిబన్లకు పాకిస్థాన్ సహకరిస్తుందన్న విషయం బహిరంగ రహస్యంగానే ఉంటోంది. అయితే, ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తమ రాజ్యాన్ని నెలకొల్పేందుకు పాకిస్థాన్ ఎంత సహకరించిందనే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాలిబన్లను సమర్థంగా తిప్పికొడుతున్న పంజ్‌షీర్ కూటమి బలగాలపై పాక్ సైన్యం వైమానిక దాడులు జరపడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
అంతేగాక, ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పాకిస్థాన్ నుంచి ఐఎస్ఐకి చెందిన పలువురు ప్రతినిధులు కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో, మంగళవారం ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న దేశ పౌరులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో నిరసనకారులు చెల్లాచెదురుగా పారిపోయారు.

1996, 2001 నాటి అరాచక పాలన తిరిగివస్తుందనే భయంతో ఆప్ఘాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ధైర్యం చేసి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కాబూల్, హెరాత్, మజర్ ఐ షరీఫ్ లాంటి ప్రాంతాల్లో మంగళవారం 70 మందికిపైగా నిరసనకారులు ఆ:దోళన చేపట్టారు. రోడ్లపై ర్యాలీ చేపట్టారు. ఇందులో ఎక్కువ మంది మహిళలే పాల్గొన్నారు. పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట కూడా వారు ఆందోళన నిర్వహించారు. పాకిస్థాన్ కారణంగానే తాము తిరిగి అరాచక తాలిబన్ల పాలనలోకి వెళుతున్నామని ఆప్ఘాన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Afghan nationals including women raise slogans like "Death for Pakistan, Azadi " outside the Pakistan embassy in Kabul, Afghanistan pic.twitter.com/On1XdfIc5u
— ANI (@ANI) September 7, 2021
నిరసనకారులపై తాలిబన్లు కాల్పులకు తెగబడినట్లు ఏఎఫ్పీ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో పౌరులు మరణించినట్లు గానీ, గాయాలైనట్లు సమాచారం లేదు. మహిళలను కూడా కొత్త ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు.
ఆప్ఘాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా పంజ్‌షీర్ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపారు. పంజ్‌షీర్ ఆప్ఘాన్ కూటమి దళాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే, పంజ్ షీర్ ప్రతిఘటన బలగాలు మాత్రం తాము ఆప్ఘాన్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని చెబుతున్నారు.
కాగా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఫయాజ్ హమీద్ ఈ వారం కాబూల్ వచ్చి తమ దేశ రాయబారిని కలిశారు. అంతేగాక, తాలిబన్ ప్రతినిధులతోనూ ఫయాజ్ భేటీ అయినట్లు సమాచారం. కాగా, ఆప్ఘాన్‌లో పాక్ జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ఘాన్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ బరాదర్‌ను ఐఎస్ఐ చీఫ్ కలవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
బరాదర్‌ను ఐఎస్ఐ చీఫ్ కలిసిన విషయం వాస్తవమేనని, అయితే, కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడంలో భాగంగానే పాక్ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయితేనట్లు తాలతిబన్ల అధికార ప్రతినిధులు చెబుతున్నారు. ఆప్ఘాన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాక్ తోపాటు ఏ ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించమన్నారు. అయితే, ఆప్ఘాన్‌లో కొత్తగా ఏర్పడే తాలిబన్ల ప్రభుత్వంలో అటు పాకిస్థాన్, ఇటు చైనా కీలకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాలిబన్ల పాలనను ఇరుదేశాలు కూడా స్వాగతించిన విషయం తెలిసిందే. తాలిబన్లు కూడా చైనా, పాక్‌తో సన్నిహిత సంబంధాలను కొట్టిపారేయడం లేదు. ఇప్పటికే తాలిబన్ల ప్రతినిధులు చైనా దేశ మంత్రులు, అధికారులతో భేటీ అయిన విషయం తెలిసిందే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications