బర్కినాఫాసో కేఫ్‌లో ఉగ్రదాడి: 17మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
బుర్కినాఫాసో: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నారని ఆఫ్రికన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

ఈ దాడి కారణంగా వాగాదుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదని పోలీసులు వెల్లడించారు. బుర్కినాఫాసోలో గత రెండేళ్ల కాలంలో ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి. గత సంవత్సరం జనవరిలో ఓ కేఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు 30మంది పౌరుల ప్రాణాలు తీశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications