వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bill Gates: దాన కర్ణుడికి ఇదేం పోయే కాలం: భార్యకు విడాకులు: 65 ఏళ్ల వయస్సులో ఆస్తిగొడవలా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ అధినేత, అపర కుబేరుడు బిల్‌గేట్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరూ ఊహించని నిర్ణయం అది. అదాయన వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించిందే అయినప్పటికీ.. ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేస్తోంది. 65 సంవత్సరాల వయస్సులో.. భార్య పక్కనే తోడుగా ఉండాల్సిన దశలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. భార్య మెలిండా గేట్స్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు వారిద్దరూ ఓ జాయింట్ ట్వీట్ చేశారు.

Recommended Video

Bill Gates Melinda Gates Divorce : ప్రేమించి చేసుకుని.. 27 ఏళ్లు అయ్యాక విడాకులు || Oneindia Telugu

27 ఏళ్ల వివాహ బంధం..

బిల్‌గేట్స్-మెలిండా గేట్స్ 1994 జనవరి 1వ తేదీన పెళ్లి చేసుకున్నారు. హవాయ్ దీవుల్లోని లనాయ్‌లో వారు ఒక్కటయ్యారు. గేట్స్ దంపతులకు రోరీ జాన్ గేట్స్, ఫోబె అడెలె గేట్స్, జెన్నీఫర్ క్యాథరిన్ గేట్స్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. మెలిండా గేట్స్ ఎవరో కాదు. బిల్‌గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని. 1987లో ఆమె ప్రొడక్ట్ మేనేజర్‌గా మైక్రోసాఫ్ట్‌లో చేరారు.

1975లో స్థాపించిన మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడే పురోభివృద్ధిలోకి వస్తోన్న సమయంలో ప్రొడక్ట్ మేనేజర్‌గా మెలిండా గేట్స్ పనితీరును కీలక పాత్రను పోషించారు. దీనితో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం డేటింగ్‌లో ఉన్న తరువాత వివాహం చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు.

నాలుగో అపర కుబేరుడు..

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ఆయన ఆస్తి 124 బిలియన్ డాలర్లు. ఇందులో కొంత మొత్తాన్ని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ కోసం కేటాయించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద దేశాలకు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ ఫౌండేషన్ కీలకపాత్ర పోషిస్తోంది. 2000లో స్థాపించిన ఈ ఫౌండేషన్‌కు మెలిండా ఛైర్‌పర్సన్. 43.3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఈ ఫౌండేషన్‌కు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ బోర్డ్ నుంచి తప్పుకొన్నారు.

65 ఏళ్ల వయస్సులో..

65 ఏళ్ల వయస్సులో..

65 సంవత్సరాల మలిదశ వయస్సులో బిల్‌గేట్స్ భార్యకు విడాకులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. 27 సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నామని వారిద్దరు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఒకరిపై ఒకరి పట్ల నమ్మకం సడలుతోందని పేర్కొన్నారు. దీనితో తమ వివాహ బంధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించలేమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరి నుంచి ఒకరికి ప్రైవసీ కావాలని ఇద్దరం కోరుకుంటున్నామని, అందుకే ఇద్దరి సమ్మతంతో విడాకులు తీసుకోనున్నట్లు చెప్పారు. విడాకుల అనంతరం తమ కొత్త జీవితం ఆరంభమౌతుందని, ఇదెలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమనీ స్పష్టం చేశారు.

English summary
Bill Gates, co-founder and former CEO of Microsoft, and his wife, Melinda French Gates, said on Twitter on Monday that they will split up after 27 years. The two will keep working together on philanthropic efforts, which have addressed education, gender equality and health care.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X