ప్రధాని మోదీతో భేటీ కోసం క్యూ..

జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

టోక్యో: ప్రపంచ దేశాలు.. భారత్ వైపు చూపులు సారిస్తోన్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమ్మిట్ కు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న నేపథ్యంలో ఆయా దేశాధినేతలు భారత్ కు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సమ్మిట్ ఏర్పాటు కానుంది. వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు.. ఇందులో పాల్గొనడానికి భారత్ కు రానున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్న నేపథ్యంలో దీనికి ఉద్దేశించిన సన్నాహాక సమావేశాలు ఇప్పటికే మొదలయ్యాయి.

జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు. వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

 After German Chancellor Olaf Scholz, now Japanese PM Kishida plans visit to India from March 19

ప్రస్తుతం జీ20 సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు కొనసాగాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొని బ్లింకెన్ సహా పలువురు భారత్ కు వచ్చారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు. తాజాగా జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియొ కిషిడ.. భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటిస్తారు.

ఆయన వెంట జపాన్ విదేశాంగ, ఆర్థిక, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు భారత్ కు రానున్నారు. ఇటీవలే జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్.. భారత పర్యటనకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. తన మూడు రోజుల పర్యటన సందర్భంగా కిషిడ- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంటారు. పెట్టుబడులు, రక్షణ, వాణిజ్యం..వంటి రంగాలకు సంబంధించిన ఒప్పందాలు ఇవి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+