షాక్: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. విదేశీయుల్లో కలకలం
అమెరికాలోకి విదేశీయులు వచ్చే అన్ని రకాల వీసాలకు సమగ్ర విధానాలను రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారో ఏమో కానీ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వాషింగ్టన్: నిన్నటి వరకూ హెచ్-1బీ వీసాల అక్రమాలపై కన్నెర్ర చేసి.. ఆ వీసా విధానాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు చట్టాలు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం రూటు మార్చారు.
అమెరికాలోకి విదేశీయులు వచ్చే అన్ని రకాల వీసాలకు సమగ్ర విధానాలను రూపొందించాలనే పట్టుదలతో ఉన్నారో ఏమో కానీ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

స్టార్టప్ వీసాల రద్దుకు యోచన?
అమెరికాలో స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసే విదేశీయులకు ఇచ్చే ‘స్టార్టప్ వీసా'లను పూర్తిగా రద్దు చేసే దిశగా ట్రంప్ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒబామా హయాంలో చివరి యేడాదిలో ఈ తరహా వీసాలు ప్రారంభించారు.

వీటితో ఎన్నో సౌలభ్యాలు.. అందుకే..
ఈ వీసాలతో ఎవరైనా విదేశీయులు ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీలకు గ్రాంట్స్ కింద అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లను ఇస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ పెట్టుబడి కింద 2 లక్షల 50 వేల డాలర్లను కంపెనీకి ఇస్తుంది. దీంతోపాటు స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేసిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు స్టార్టప్ వీసాను ఇస్తారు.

వచ్చే ఏడాది వరకు వాయిదా...
ఈ వీసా విధానం పూర్తిగా విదేశీయులు అక్రమాలకు పాల్పడే విధంగా రూపొందించారనేది ట్రంప్ ప్రభుత్వ వాదన. దీన్ని రద్దు చేయాలా..? సంస్కరణలు ప్రవేశపెట్టాలా..? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా ఈ వీసాల జారీని వచ్చే యేడాది మార్చి వరకూ వాయిదా వేసింది.

భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలు...
‘స్టార్టప్ వీసా'లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టెక్ దిగ్గజాలు భగ్గుమంటున్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, వంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. హెచ్-1బీ వీసా విధానాలపై అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అన్ని టెక్ కంపెనీలు ఒక్కటైనట్లు ఈ విషయంలో కూడా ఏకమయ్య అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications