Maldives News: ఇండియాతో పెట్టుకున్న మాల్దీవుల గల్లా ఖాళీ.. కొత్త ప్లాన్ ఇదే..
Maldives Currency Rules: డాలర్ కొరతతో ఉన్న మాల్దీవులు కొత్త విదేశీ కరెన్సీ నియంత్రణను ప్రవేశపెట్టింది. విదేశీ కరెన్సీలో అనుమతించబడిన లావాదేవీల రకాలను పరిమితం చేసింది. పర్యాటక సంస్థలు, బ్యాంకులపై తప్పనిసరి విదేశీ కరెన్సీ మార్పిడి నియంత్రణలను విధించింది. గత సంవత్సరం అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ 'ఇండియా అవుట్' ప్రచారానికి ప్రతిస్పందనగా సుందరమైన ద్వీప దేశానికి పర్యటనలను భారతీయ టూరిస్టులు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది.
భారతదేశం 50 మిలియన్ డాలర్ల వడ్డీ రహిత రుణాన్ని పొడిగించిన తర్వాత మాల్దీవులు గత నెలలో ఇస్లామిక్ బాండ్ చెల్లింపులో డిఫాల్ట్‌ను తప్పించుకోగలిగింది. మాల్దీవుల ఫారెక్స్ నిల్వలు ద్వీపదేశ దిగుమతి బిల్లుతో సరిపోలకపోవడంతో సెంట్రల్ బ్యాంక్.. మాల్దీవుల మానిటరీ అథారిటీ (MMA) అక్టోబర్ 1న కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పర్యాటక పరిశ్రమ ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ ఆదాయాన్ని స్థానిక బ్యాంకుల్లో జమ చేయాలని కోరింది. చెల్లింపులకు డాలర్ల కొరత ఏర్పడటంతో ఆగస్టులో మాల్దీవుల సెంట్రల్ బ్యాంక్ ఈ రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

విదేశీ కరెన్సీ రెగ్యులేషన్ ప్రకారం మాల్దీవుల్లోని అన్ని లావాదేవీలు తప్పనిసరిగా మాల్దీవియన్ రుఫియాలో నిర్వహించబడాలని ఆదేశించింది. విదేశీ కరెన్సీలో స్పష్టంగా అనుమతించబడిన వాటికి మినహాయింపు ఉంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిబంధనల ప్రకారం గూడ్స్ అండ్ సర్వీస్ పేమెంట్స్, పనుల విలువ, రుసుములు, ఛార్జీలు, అద్దె, వేతనాలను స్థానిక కరెన్సీలో చేస్తూ.. వాటిని విదేశీ కరెన్సీలో ఈ లావాదేవీల కోసం ఇన్‌వాయిస్ చేయడాన్ని నిషేధిస్తుంది. కేవలం నిర్థేశించిన చెల్లింపులకు మాత్రమే ఇది అనుమతించబడింది.
ఈ క్రమంలో టూరిస్ట్ రిసార్ట్‌లు, గెస్ట్‌హౌస్‌లు మొదలైన వాటి అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాన్ని నిబంధనల ప్రకారం మాల్దీవుల్లోని లైసెన్స్ పొందిన బ్యాంకులో ఉన్న విదేశీ కరెన్సీ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి టూరిస్ట్ రిసార్ట్, టూరిస్ట్ వెసెల్ లేదా టూరిస్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆపరేటర్ ఒక టూరిస్ట్‌కు కనీసం 500 డాలర్లను లైసెన్సు పొందిన బ్యాంకుల ద్వారా స్థానిక కరెన్సీలోకి మార్చుకునేందుకు అనుమతించింది.
దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని టూరిస్ట్ ఆపరేటర్ వారి కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవచ్చు. నిపంధనలు పాటించనివారిపై భారీ జరిమానాలు ఉంటాయని మాల్దీవుల ప్రభుత్వం కొత్త నిబంధనల్లో వెల్లడించింది. ప్రస్తుతం మాల్దీవుల అప్పులు జీడీపీలో 110 శాతంగా అంచనా వేయబడింది. అలాగే ఫిచ్ రేటింగ్స్ ప్రకారం బయటి రుణాలు 2025 నాటికి 557 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 నాటికి 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications