నో సెక్స్.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వద్దు, 3 రోజులు, ఆదేశం
కరోనాకు దివ్య ఔషధం వ్యాక్సినే. తొలుత అపోహలు ఉండగా.. ఇప్పుడు మాత్రం వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీకా తీసుకుంటే డ్రింక్ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. కానీ స్పూత్నిక్ వ్యాక్సిన్ గురించి కీలక విషయం వెలుగుచూసింది. టీకా తీసుకుంటే శృంగారం నో అంటున్నారు నిపుణులు. ఈ మేరకు ఆ దేశం ఆదేశాలు కూడా జారీచేసింది.

నో సెక్స్..
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తీసుకుంటే మూడు రోజులు సెక్స్‌కి దూరంగా ఉండాలని రష్యా ఉప ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డెనిస్ గ్రైఫెర్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శారీరకమైన ఒత్తిడి కలగకుండా చూసుకోవాలని కోరుతున్నారు. శారీరకమైన పనులు ఏవీ చేయొద్దని, సెక్స్ కూడా అలాంటిదేనని తెలిపారు.

వోడ్కా, స్మోకింగ్ వద్దు..
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వోడ్కా, స్మోకింగ్ లాంటివి చేయొద్దని రష్యాలో ఆదేశాలు అమల్లో ఉన్నాయి. రష్యా ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆ దేశంలో 13 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. పక్కనే ఉన్న యూరప్ దేశాల్లో ఈ సగటు 30 శాతంగా ఉంది. ఇప్పుడు సెక్స్ కూడా మానాలంటే వ్యాక్సిన్‌పై మరింత అసంతృప్తి పెరుగుతుందనే వాదన ఉంది.

సెక్స్ చేస్తే ఎనర్జీ..
సెక్స్ అనేది చాలా ఎనర్జీని ఉపయోగించే కార్యక్రమం.. వ్యాక్సిన్ వేసుకున్నాక తర్వాత ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండాలని చెబుతున్నామని.. అందులో సెక్స్ కూడా ఉంది అని ఇద్దరు పిల్లలు ఉన్న 38 ఏళ్ల మంత్రి డాక్టర్ డెనిస్ గ్రైఫెర్ తెలిపారు. రష్యా ప్రజలకు అక్కడి ప్రభుత్వం, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేయిస్తోంది. ఇది 2 డోసుల వ్యాక్సిన్.
దాదాపు కోవిషీల్డ్ వ్యాక్సిన్ లాంటిదే. అయితే... ఈ వ్యాక్సిన్‌కి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నుంచి ఇంకా అనుమతి రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. 47 దేశాల్లో మాత్రం ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.

సెక్స్ వద్దని చెప్పడంతో..
ప్రజల్లో ఈ వ్యాక్సిన్‌పై నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణం తెలుస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా సరిగా నిర్వహించలేకపోవడం ఓ కారణం అని సమాచారం. సెక్స్ చేయవద్దని చెబుతున్న మాట కూడా ప్రజల్లో వ్యాక్సిన్‌పై వ్యతిరేకతను పెంచుతుందనే వాదన ఉంది. రష్యాలో ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉందని అంటున్నారు.
ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు రష్యాను పట్టి పీడిస్తోంది. ఇది ఒకరి నుంచి 8 మందికి సోకగలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలో మొదట కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చింది రష్యా కాగా.. దానికి WHO అనుమతి ఇవ్వలేదు. అయినా ప్రజలకు వ్యాక్సిన్ వేసేసింది.












Click it and Unblock the Notifications