భారత్ కు బిగ్ షాక్.. పాకిస్థాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసిన AIIB
ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(AIIB) కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పాకిస్థాన్ కు భారీ సాయం ప్రకటించింది. పాకిస్థాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించింది. లాహోర్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ కు ఈ సాయం చేయనుంది AIIB. లాహోర్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు రావి నదిలోకి వ్యర్థాలు ప్రవేశించకుండా ఆ దేశం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ కు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ భారీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
లాహోర్ వాటర్ అండ్ శానిటేషన్ ఏజెన్సీ సంస్థ, చైనాకు చెందిన మరో సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాయి. లాహోర్ లో తాగునీటి సరఫరా సమస్యను తీర్చడంతోపాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే లాహోర్ లో మురుగునీటి లీకేజీ సమస్యకు చెక్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లాహోర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(AIIB) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు విడతల వారీగా ఈ మొత్తాన్ని పాకిస్థాన్ కు అందించనుంది.
అయితే గతంలోనూ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, AIIB తదితర అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థలు పాకిస్థాన్ కు సాయం చేసిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ మొత్తాన్ని ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నట్లు అనేకసార్లు వెల్లడైంది. ఈ క్రమంలో మరోసారి AIIB భారీ సాయం ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలోనూ చాలాసార్లు పాకిస్థాన్.. ఉగ్రస్థావరాల నిర్మాణానికి ఈ సాయాన్ని తరలించింది. మరోసారి పాకిస్థాన్ అదే బాటలో వెళ్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలాఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలను, పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లను ఆ దేశం నిర్మిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. వీటి నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు తాజాగావెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో పహల్గామ్ తరహాలో మరో దాడికి పాకిస్థాన్ కుట్రపన్నుతున్నట్లు తెలిపారు. అయితే పాకిస్థాన్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications