విమానసంస్థ నిర్లక్ష్యం.. కునుకుతీసిన మహిళ.. కళ్లు తెరిచిచూస్తే 50 అడుగుల ఎత్తులో.

మోన్‌ట్రియాల్ : ఎయిర్ కెనడా ఫ్లైట్‌లో ప్రయాణించిన ఓ లేడీ ప్యాసింజర్‌కు భయంకరమైన అనుభవం ఎదురైంది. ప్రయాణంలో నిద్రపోయిన మహిళను విమాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఫ్లైట్‌లోనే ఉండిపోయింది. కాసేపటికి నిద్ర మేల్కొన్న సదరు మహిళ చుట్టూ చీకటిగా ఉండటంతో మొదట తాను ఎక్కడుందో తెలియక కంగారు పడింది. చివరకు ఓ టార్చ్ సాయంతో బయటపడింది.

ఫ్లైట్‌లో నిద్రపోయిన ప్యాసింజర్

ఫ్లైట్‌లో నిద్రపోయిన ప్యాసింజర్

ఈ నెల 9న టిఫానీ ఆడమ్స్ అనే మహిళ ఎయిర్ కెనడా ఫ్లైట్‌లో క్యూబెక్ నుంచి టొరంటోకు బయలుదేరింది. గంటన్నర జర్నీ కావడంతో కాసేపు కునుకు తీయాలని భావించింది. నిద్ర మేల్కొ ని చూసిన ఆమెకు విమానంలో ఎవరూ కనిపించలేదు. విమానం ల్యాండ్ కాగానే మిగతా ప్రయాణీకులతో పాటు ఎయిర్‌లైన్స్ సిబ్బంది కూడా దిగి వెళ్లి పోయారు. ఎవరూ ఆమెను గమనించి నిద్ర లేపలేదు. దీంతో టిఫానీ ఒక్కరే ఫ్లైట్‌లో ఉండిపోయారు. లోపలంతా చిమ్మ చీకటిగా ఉండటంతో కంగారు పడ్డ టిఫానీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరికైనా ఫోన్ చేసి విషయం చెప్పేందుకు ప్రయత్నించినా మొబైల్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో సాధ్యం కాలేదు

టార్చ్ సాయంతో బయటపడి

టార్చ్ సాయంతో బయటపడి

భయంతో వణికిపోయిన టిఫానీ కాసేపటికి ధైర్యం కూడగట్టుకుని ఫ్లైట్ కాక్‌పిట్‌లోకి వెళ్లింది. అక్కడ ఓ టార్చ్‌లైట్ దొరకడంతో విమానం మెయిన్ డోర్ వద్దకు చేరుకుని కష్టపడి దాన్ని ఓపెన్ చేసింది. భూమికి 50 అడుగుల ఎత్తులో ఉండటంతో కిందకు ఎలా దిగాలో టిఫానీకి అర్థం కాలేదు. డోర్ వద్దనే కూర్చొని టార్చ్ లైట్‌తో ఎయిర్‌పోర్ట్ వైపు సిగ్నల్స్ ఇచ్చింది. కాసేపటికి ఆమె నిరీక్షణ ఫలించింది. టార్చ్‌లైట్ వెలుగును గమనించిన ఎయిర్‌పోర్ట్ ఉద్యోగి ఒకరు అక్కడకు వచ్చి ఆమెను కిందకు దించారు. అనంతరం టిఫానీని ఎయిర్ కెనడా అధికారులతో మాట్లాడించారు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

పీడ కలలాంటి ఈ ఘటనను టిఫానీ తన స్నేహితురాలితో చెప్పింది. ఆమె ఈ ఉదంతాన్ని ఎయిర్ కెనడా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చి వైరల్‌గా మారింది. పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు ఎయిర్ కెనడాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఎయిర్ కెనడా సైతం క్షమాపణ చెప్పింది. టిఫానీని పూర్తి వివరాలు కోరింది. దాని ఆధారంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+