లాండింగ్ గేర్ ఫెయిల్: రన్ వేపై జారిన విమానం, 25మందికి గాయాలు

కెనడా: భారీగా పొగమంచు కురుస్తుండడంతో కెనడాలోని నోవా స్కోటియా నగరంలోని హాలీఫాక్స్ అంతర్జాతీయ విమానంలో ల్యాండైన ఎయిర్ కెనడా జెట్ విమానం(ఎయిర్ బస్ 320) రన్‌పై జారిపోయింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

భారీగా పొగమంచు కురుస్తుండడంతో దృశ్య గోచరత్వం లేదని కెనడా పర్యావరణశాఖ స్నోఫాల్ అలర్ట్ జారీచేసింది. ఈ నేపథ్యంలో పొగమంచు తొలగిపోయిన తర్వాత రన్‌వేపై దిగవచ్చని ప్రయాణికుల్లో ఒకరు చెప్పినా.. గగనతలంలో చక్కర్లు కొట్టేందుకు అవసరమైన ఇంధనం లేనందు వల్లే రన్‌వేపై విమానాన్ని దించాల్సి వచ్చిందని విమాన సిబ్బంది ఒకరు చెప్పారు.

Air Canada plane touched down short of runway, lost landing gear

కాగా, పైలట్‌ విమానాన్ని దించే సమయంలోనే హఠాత్తుగా విమానాశ్రయంలో కరెంటు పోయింది. అంతా చిమ్మ చీకటి. లాండింగ్ గేర్లు కూడా ఫెయిలవడంతో విమానం టైర్లు రన్‌వేను తాకాయి. విమానం ఒక్కసారిగా రన్‌వేను దాటి దూసుకుపోయింది. విమానం ముందు భాగం దెబ్బతింది. రెక్కలు కరెంటు తీగలకు తగిలి తుక్కుతుక్కయ్యాయి.

విమానంలో ఉన్న 132 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. కరెంటు పోవడం, భారీ మంచు లేకుంటే మంటలు రేగి వారంతా పెను ప్రమాదం
బారిన పడేవారని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు విమానంలోని 25 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+