రహస్యంగా అంతరిక్షంలోకి.. 718 రోజుల త‌ర్వాత భూమ్మీదికి .. ఇన్నాళ్లూ ఇదేం చేసిందో?

అమెరికా అత్యంత ర‌హ‌స్యంగా అంత‌రిక్షంలోకి పంపిన ఓ విమానం ఆదివారం నేల‌పైకి దిగింది. ఈ విమానం పేరు ఎక్స్‌-37బీ. ఇది 718 రోజులపాటు అంతరిక్షంలో విహరించి ఇప్పుడు భూమ్మీదికి తిరిగొచ్చింది.

వాషింగ్ట‌న్: అమెరికా అత్యంత ర‌హ‌స్యంగా అంత‌రిక్షంలోకి పంపిన ఓ విమానం నేల‌పైకి దిగింది. ఈ విమానం పేరు ఎక్స్‌-37బీ. ఇది 718 రోజులపాటు అంతరిక్షంలో విహరించి ఇప్పుడు భూమ్మీదికి తిరిగొచ్చింది.

ఫ్లోరిడాలోని కెన్న‌డీ స్పేస్ సెంట‌ర్‌లో ఆదివారం ఇది సుర‌క్షితంగా దిగింది. పైల‌ట్ లేకుండానే ఈ విమానం ఇన్నాళ్లూ అంతరిక్షంలో చ‌క్క‌ర్లు కొట్టింది. నాసా అనుసంధానంతో అమెరికా వైమానిక ద‌ళం ఎక్స్‌-37బీ విమానాన్ని సీక్రెట్ మిష‌న్ కోసం ఉపయోగిస్తోంది.

us-secret-plane

ఆర్బిటాల్ టెస్ట్ వెహికిల్ మిష‌న్ 4(ఓటీవీ-4) టెక్నాల‌జీతో ఈ విమానాన్ని ప్ర‌యోగించారు. గతంలో ఓటీవీ-1 విమానం కూడా అంత‌రిక్షంలో 224 రోజులు గ‌డిపింది. ఆ త‌ర్వాత ఓటీవీ-2 విమానం 468 రోజులు, ఓటీవీ-3 విమానం 675 రోజులు చ‌క్క‌ర్లు కొట్టాయి.

ఓటీవీ-4 మిష‌న్‌ను ముందు నాసా ప్రాజెక్టుగా మొద‌లుపెట్టారు. కానీ దాన్ని త‌ర్వాత పెంట‌గాన్‌కు బదిలీ చేశారు. అయితే ఎక్స్‌-37బీ ఎందుకు అన్ని రోజులు అంత‌రిక్షంలో విహ‌రించింద‌న్న విషయమై అమెరికా వైమానిక ద‌ళం నోరు విప్పడంలేదు.

స్పేస్ బాంబింగ్‌, నిఘా కార్య‌క్ర‌మాలు గురించి ఎక్స్‌-37బీ విమానం ర‌హ‌స్యంగా నిఘా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. చైనా స్పేస్ స్టేష‌న్ తియాంగ్‌గాంగ్ గురించి కూడా ఈ ర‌హ‌స్య విమానం ఆరా తీసిన‌ట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+