గాజాలో మారణహోమం- ఆసుపత్రిపై దాడి: 500 మందికి పైగా దుర్మరణం

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

ఈ దాడులను హమాస్ తిప్పి కొడుతోంది. టెల్ అవివ్ సహా పలు నగరాలపై మోర్టార్లను సంధిస్తోంది. ఈ నెల 7వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో 4,000 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Air strike by Israel killed hundreds of people at a Gazas Al-Ahli Baptist City hospital

తాజాగా గాజాలోని అల్- అహ్లీ అల్- అరబ్బీ ఆసుపత్రిపై దాడి సంభవించింది. ఈ ఘటనలో 500 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. గాజా ఉత్తర ప్రాంతంలోని అల్ ఉమిలూన్ మార్గంలో ఉంటుంది ఆసుపత్రి. మొత్తం గాజా స్ట్రిప్‌లోనే అతి పెద్ద ఆసుపత్రిగా చెబుతుంటారు. ఈ యుద్ధంలో గాయపడిన వారిలో చాలామంది ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి దాటిన తరువాత అల్- అహ్లీ ఆసుపత్రిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. దీనిపై బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో భారీ శబ్దం చేస్తూ పేలిపోయిందా ఆసుపత్రి. కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి మంటలు అంటుకున్నాయి. ఉవ్వెత్తున చెలరేగాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకూ వినిపించిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఘటనలో 500 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. పాలస్తీనా అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులు, ఇతర వాహనాల్లో మరో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పాలస్తీనా అథారిటీ ఆరోగ్యశాఖ మంత్రి మై అల్‌కైలా ఆరోపించారు. అత్యంత అమానవీయంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను వార్ క్రైమ్‌గా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+