ప్రపంచంలోనే అతి పెద్ద విమానం గాల్లో (వీడియో)
లండన్: ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఎట్టకేలకు గాలిలోకి ఎగిరింది. గత వారంలో ఈ విమానాన్ని తొలిసారి నడపడానికి ప్రయత్నించారు. అయితే సాంకేతిక లోపం కారణాల వలన అది సాధ్యం కాలేదు.
కొంత విమానం, కొంత ఎయిర్ షిప్ అయిన ఎయిర్ ల్యాండర్-10 విమానం బుధవారం సెంట్రల్ ఇంగ్లాడ్ లోని కార్డింగ్టన్ లో ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఎయిర్ ల్యాండర్ -10 మొదటి సారి గాల్లోకి ఎగురుతున్న సందర్బంగా దానిని వీక్షించడానికి ప్రజలు క్యూకట్టారు.
1930 అక్టోబర్ లో ఇదే ఎయిర్ ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్ షిప్ ఆర్ -101 ఫ్రాన్స్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడే మరణించారు. ఆ ప్రమాదం జరిగిన తరువాత బ్రిటన్ లో ఎయిర్ షిప్ లు తయారు చెయ్యడం నిలిపివేశారు.
అయితే అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ కు చెందిన హైబ్రిడ్ వెహికిల్స్ (హెచ్ఏవీ) తాజాగా 302 అడుగుల పొడవున్న ఎయిర్ ల్యాండర్ -10ను రూపొందించింది. ఈ విమానం చూడటానికి చాల ఆకర్షనీయంగా, అద్బుతంగా ఉంది.












Click it and Unblock the Notifications