బెడ్రూంలో ప్రియుడితో భార్య: చిర్రెత్తుకొచ్చిన భర్త ఇలా(వీడియో)
తన భార్య ఆమె ప్రియుడితో పడకగదిలో గడపడం చూసిన ఓ భర్తకు పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో అతనిపై దాడికి దిగాడు.
అలబామా: తన భార్య ఆమె ప్రియుడితో పడకగదిలో గడపడం చూసిన ఓ భర్తకు పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతనిపైబడి చితక్కొట్టేశాడు. ముఖంమీద పిడిగుద్దులు గుద్దుతూ అతని కోపన్నంతా ప్రదర్శించాడు. ఈ ఘటన అలబామాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అలబామాలో ఓ వ్యక్తి బయటకు పనిమీద వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన భార్య పడకగదిలో ఆమె ప్రియుడితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది.
ఆ దృశ్యాన్ని చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా తన భార్యతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. తన భర్త ఆవేశాన్ని చూసి భయంతో భార్య పారిపోగా, ఆమె ప్రియుడ్ని మాత్రం ఆ భర్త చితక్కొట్టాడు.
ఈ తతంగాన్నంతా ఆ భర్తతోపాటు వచ్చిన మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తగిన బుద్ధి చెప్పావంటూ ఆ భర్తకు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. చీటింగ్ వైఫ్ అంటూ ఆమెపై మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications