అలస్కాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు ఉపసంహరణ
హవాయి: అలస్కాలో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 8.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత సునామీ హెచ్చరికలు రద్దు చేసినట్లు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది.
పీటీడబ్ల్యూసీ ప్రకారం అలస్కా పెనిసులా ప్రాంతంలో రాత్రి 8.25 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకు సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.

గురువారం తెల్లవారుజామున సునామీ అలలు హవాయీకి చేరుకున్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. అయితే, సముద్రపు అలల తీవ్రత అంతగా లేదని తెలిపింది. ఈ క్రమంలో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications