Miss Universe Buenos Aires: 60 ఏళ్ల బామ్మ కాదు.. అందాల భామ..!

60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణ రామ అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. లేకుంటే మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం తన రూటే సపరేటు అంటున్నారు. అందాలో పోటీలో పాల్గొని విజయం సాధించారు. ఇప్పుడు ఆమె 60 ఏళ్ల బామ్మ కాదు. అందాల భామ. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదూ.. అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్. 60 ఏళ్ల వయసున్న అలెజాండ్రా
బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌ మిస్ యూనివర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

60 ఏళ్ల వయస్సులో బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌కు మిస్ యూనివర్స్ గెలుచుకున్న మహిళగా రికార్డు సృష్టించారు. చక్కటి చిరునవ్వు, వయస్సు మీదపడుతున్నా తరగని అందం, మాట తీరుతో అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ న్యాయనిర్ణేతల మనస్సులు గెలుచుకుని టైటిల్ ఎగురెసుకుకెళ్లింది.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాలో అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ నివస్తున్నారు. ఆమె వృత్తిరీత్య న్యాయవాది. అలాగే పాత్రికేయురాలిగా పని చేసిన అనుభవం కూడా ఉంది.

Alejandra Marisa Rodriguez won Miss Universe Buenos Aires Title at the age of 60

ఆమె పోటీలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. కానీ వారి నవ్వులకు, అవమానాలకు ప్రపంచ సుందరీ కీరిటాన్ని దక్కించుకుని అలెజాండ్రా సమాధానం చెప్పారు. అలెజాండ్రా మిస్ యూనివర్స్ అర్జెంటీనా 2024 మేలో జరగబోయే పోటీకి తాను సిద్దం అవుతున్నట్లు చెప్పారు. మెక్సీకోలో 2024 సెప్టెంబర్ 28న జరగబోయే వేడుకలో సైతం తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

అందాల పోటీలు అంటే కేవలం శరీరక అందం మాత్రమే కాదని అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసం ఉండాలని చెప్పారు. మిస్ యూనివర్స్ సంస్థ గత సంవత్సరం పోటీలో పాల్గొనేవారికి ఏజ్ లిమిట్ లేదని ప్రకటించడంతో అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ఈ సంవత్సరం నుంచి 18 ఏళ్లు నిండిన ఏ మహిళ అయినా పోటీలో పాల్గొనవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+