Jack Ma: విజిటింగ్ ప్రొఫెసర్‌గా అపర కోటీశ్వరుడు

టోక్యో: చైనాకు చెందిన ఇ-కామర్స్ జెయింట్ అలీబాబా సహ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు జాక్ మా.. ఇప్పుడు ఓ సాధారణ ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ టోక్య అఫిలియేటెడ్‌గా పని చేస్తోన్న టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు యూనివర్శిటీ అధికారులకు ఆయనకు అపాయింట్‌మెంట్ లెటర్‌ను జారీ చేశారు.

సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తిలో ఆయన టోక్యో కళాశాల తరఫున పరిశోధనలు సాగిస్తారని తెలిపారు. ఓ సక్సెస్‌ఫుల్ పారిశ్రామికవేత్తగా తన అనుభవాలను ఆయన విద్యార్థులు, కాలేజీ ఫ్యాకల్టీతో పంచుకుంటారని వెల్లడించారు. ఎంట్రప్రెన్యువర్‌షిప్, కార్పొరేట్ మేనేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌పై జాక్ మా అనుభవాలు తమ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

jackma

తన సొంత దేశం చైనా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలపై అనుసరిస్తోన్న విధానాలను జాక్ మా బహిరంగంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 2020లో చైనీస్ రెగ్యులేటరీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. సుదీర్ఘకాలం పాటు బయటికి రాలేదు. ఎవరికీ కనిపించలేదు. చైనా బెదిరింపుల వల్లే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి.

ఆ తరువాత అలీబాబా సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంది. దీని అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ జారీ చేయదలిచిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ను కూడా నిలిపివేయాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం అనంతరం జాక్ మా చైనాలోని హాంగ్ఝౌలో కనిపించారు. ఓ పాఠశాలను సందర్శించారాయన. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఛాట్‌జీపీటీపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

jackma

వ్యాపార కార్యకలాపాల నుంచి వైదొలగిన తరువాత అధ్యాపకుడిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లోనే చెప్పారు. దీన్ని నెరవేర్చుకున్నట్టయింది. ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఆయన కెరీర్ ముగింపు దశకు చేరుకుందంటూ లైట్‌స్ట్రీమ్ రీసెర్చ్‌ అనలిస్ట్ ఓషధి కుమారసిరి వ్యాఖ్యానించారు. అలీబాబా ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పడానికి ముందు జాక్ మా ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+