అబూసలేంతో పెళ్లి లేకుంటే సూసైడ్: యువతి బెదిరింపు
ముంబై: అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ అబూ సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువతి బెదిరించింది. 26 ఏళ్ల యువతి తాను సలేంను పెళ్లి చేసుకుంటానని, తనకు అనుమతివ్వాలని టాడా కోర్టును అనుమతి కోరిన విషయం తెలిసిందే.
ఆ యువతి ఆదివారం నాడు నిఘా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. థానే జిల్లా మంబ్రా పట్టణానికి చెందిన సయ్యద్ బహార్ కౌసర్ (25) కామర్స్ గ్రాడ్యుయేట్.
టాడా కోర్టులో వేసిన పిటిషన్లో... తనను సలేం వివాహం చేసుకున్నట్టు గతంలో ముంబై సిటీ టాబ్లాయిడ్ ఓ వార్త ప్రచురించడంతో పోలీసులు తన గురించి విచారణ చేశారని సదరు మహిళ పిటిషన్లో పేర్కొంది.

అబూ సలేంతో ఆమె ఉన్న ఫోటోను పలువురికి చూపించి వివాహం గురించి అడిగారని, కానీ పెళ్లి కాలేదని తెలిసిందన్నారు. పోలీసుల దర్యాఫ్తు ఆమె పైన ప్రభావం చూపించిందని, ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేదని, అందుకే అబూ సలేంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
ఆమె కోర్టులో ఆరు పేజీల పిటిషన్ దాఖలు చేసింది. తనకు అబూ సలేంతో పెళ్లైనట్లుగా వార్తలు వచ్చిన సమయంలో పోలీసులు తన స్నేహితురాలి పైన చేయి చేసుకున్నారని ఆరోపించింది. అజంఘర్, లక్నో, గుజరాత్‌లలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఇళ్లకు కూడా పోలీసులు వెళ్లారని తెలిపింది. కాగా, తన ఫోటోను మార్ఫింగ్ చేసి నాడు టాబ్లాయిడ్‌లో వేశారని ఆరోపించింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications