అమెరికా: 40 వేల మంది సైనికులు ఇంటికి
వాషింగ్టన్: సైన్యంపై పెరుగుతున్న ఖర్చులు తగ్గించాలని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించింది. అందుకు 40 వేల మంది సైనికులను తొలగించాలని అమెరికా నిర్ణయం తీసుకునిందని యూఎస్ఏ టు డే పత్రిక తెలిపింది. సైనికులను తొలగిస్తే ఖర్చలు ఆదా అవుతాయని అమెరికా బావిస్తున్నది.
అమెరికాతో పాటు విదేశాలలో 4,90,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. సైన్యం మీద ఖర్చులు దాదాపుగా తగ్గించాలని అమెరికా ఆర్మీ ప్రణాళికలు సిద్దం చేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించడానికి అమెరికా సిద్దం అవుతున్నది.

అమెరికా ఆర్మీలో పని చేస్తున్న 40 వేల మందిని, ఆర్మీ కోసం పని చేస్తున్న 17 వేల మంది పౌరులను తొలగించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇదే అమలు అయితే 2017 నాటికి అమెరికాలో 4 లక్షల 50 వేల మంది సైనికులు ఉంటారు.
ప్రస్తుతం అమెరికాలో 4 లక్షల 90 వేల మంది సైనికులు ఉన్నారు. 4,50,000 మంది సైనికుల కంటే తక్కువ ఉంటే యుద్దాలలో గెలవడం చాల కష్టమని ఇప్పటికే ఆర్మీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్ లో యుద్దం చేస్తున్న సమయంలో అమెరికాలో 5,70,000 మంది సైనికులు ఉన్నారు.












Click it and Unblock the Notifications