ముందు అమెరికా ప్రయోజనాలు: భారత్‌తో భారీ ఒప్పందంకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

Recommended Video

    Evening News Express : 3 Minutes 10 Headlines | Trump India Visit | MP CM Kamal Nath Slams PM Modi

    వాషింగ్టన్: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రోజు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. భారత్ పర్యటన సందర్భంగా అమెరికా ఓ భారీ ఒప్పందం కుదుర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. లాస్‌వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎవరూ వూహించని ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంటామనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్, ఆగ్రా మరియు న్యూఢిల్లీల్లో పర్యటిస్తారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మద్య పలు వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయనే వార్త షికారు చేస్తోంది. ఇరు దేశాల మధ్య అనుకున్న రీతిగా మంచి ఒప్పందాలు జరగకపోతే చర్చల్లో వేగం తగ్గుతుందని వెల్లడించారు. అదే జరిగితే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. అదే సమయంలో ట్రంప్ మరో మాట కూడా చెప్పారు. ఒకవేళ ఒప్పందాలు మంచివైతేనే ముందుకెళతామని లేదంటే ఆలోచిస్తామని చెబుతూ తమకు ముందుగా అమెరికా ప్రయోజనాలు ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు.

    America interests first, will make tremendous deal with India:Donald Trump

    వస్తువులు మరియు సేవల రంగంలో ఇతర దేశాలతో అమెరికా చేసుకున్న ఒప్పందాలతో పోలిస్తే ఒక్క భారత్‌తోనే మూడు శాతం ఒప్పందాలు చేసుకుంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం భారత్‌కు ఎంతో ఉపయోగమని ఈ మధ్యే కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది. 2018లో అమెరికానే అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా భారత్‌కు నిలిచిందని వెల్లడించింది. ఇక అమెరికా భారత్‌ మధ్య వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతుండటానికి కారణం భారత్ అవలంబిస్తున్న లోపభూయిష్టమైన వాణిజ్య విధానాలే అని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పేర్కొంది.

    మోడీ తొలి ప్రభుత్వంలో వాణిజ్య సంస్కరణలను పక్కనబెట్టిందని సీఆర్ఎస్ పేర్కొంది. అంతేకాదు సుంకాల పెంపు, ఇతర ఆంక్షలను కఠినతరం చేసిందని సీఆర్ఎస్ వెల్లడించింది. ఇక రెండోసారి మోడీ అఖండ విజయం నమోదు చేయడంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణిస్తూ వస్తోందని సీఆర్ఎస్ అభిప్రాయపడింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్‌ఆర్) విడుదల చేసిన వాస్తవిక పట్టిక ప్రకారం భారత్ అమెరికా దేశాల మధ్య వస్తు సేవా రంగంలో 1999 నుంచి 2018వరకు వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. 1999లో 16 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం వస్తువులు సేవల రంగంలో అమెరికా భారత్‌ల భాగస్వామ్యం ఎనిమిదో స్థానంలో నిలిచింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+